జ్యోతిష శాస్త్రంలో చెప్పిన ప్రకారం పుట్టిన రాశిని బట్టి ఒక వ్యక్తి స్వభావం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, దక్కే విజయాలపై ప్రభావం పడుతుంది. ప్రతి రాశి చక్రానికి ఒక సహజంగా కొన్ని లక్షణాలు, బలహీనతలు ఉంటాయి. కొన్ని రాశుల్లో పుట్టిన వారికి ఇబ్బందులు, పోరాటాలు, ప్రతికూల పరిస్థితులు అధికంగా ఉంటే మరికొన్ని రాశుల్లో పుట్టిన వారికి అదృష్టం అధికంగా ఉంటుంది. ఇక ఓర్పు, సహనం ఉండే రాశులు కొన్ని ఉన్నాయి. ఇందులో పుట్టిన వారికి ఎలాంటి సమస్య వచ్చినా, ఎన్ని మాటలన్నా ఓర్పుతో సహనంతో భరిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.