‘మీరు మా మీద జోకులు వేయడం కాదు..మా మీద మేమే జోకులు వేసుకుంటాం’ ట్రోలర్స్ కి హీరోయిన్ల కౌంటర్

Published : Jan 19, 2026, 11:48 AM IST

ట్రోలింగ్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది.ముఖ్యంగా మూవీ ఫీల్డ్ లో ఉన్నవారు ఇలాంటివి చాలా చూడాల్సి ఉంటుంది. కొందరు స్టార్ హీరోయిన్స్ కి కూడా ఇది తప్పలేదు. 

PREV
15
Trolls

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీలపై ట్రోల్స్ రావడం చాలా సాధారణం. అయితే కొందరు హీరోయిన్లు ఆ ట్రోల్స్ చూసి కుంగిపోకుండా.. రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆ ట్రోల్స్ కి సమాధానంగా రివర్స్ లో తమను తామే ట్రోల్ చేసుకుంటూ ( Self Deprecating Humor) విమర్శకుల నోళ్లు మూయించారు. ‘ మీరు మా మీద జోకులు వేయడం కాదు.. మా మీద మేమే జోకులు వేసుకుంటాం’ అంటూ ట్రోలర్స్ కి షాకిచ్చిన కొందరు స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వారెవరో చూద్దాం...

25
1.అలియా భట్.. ‘జీనియస్ ఆఫ్ ది ఇయర్’

ట్రోల్స్ ని తన విజయానికి మెట్లుగా మార్చుకున్న వారిలో అలియా భట్ మొదటి స్థానంలో ఉంటుంది. ‘ కాఫీ విత్ కరణ్’ షోలో భారత రాష్ట్రపతి పేరు తప్పుగా చెప్పడంతో ఆమెపై ‘జోరూ నాలెడ్జ్’ అంటూ ఆమెను ట్రోల్ చేస్తూ చాలా మీమ్స్ వచ్చాయి. అయితే.. ఆ ట్రోల్స్ కి అలియా కొంచెం కూడా బాధపడలేదు. వాటికి కౌంటర్ గా జీనియస్ ఆఫ్ ది ఇయర్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. తనను తానే ఆ వీడియోతో ట్రోల్ చేసుకుంది. ఈ ఒక్క వీడియోతో తనపై ఉన్న నెగిటివిటీ మొత్తం పాజిటివ్ గా మార్చుకుంది.

35
రష్మిక మందాన..

ఒక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో నితిన్. రష్మిక కుక్క బిస్కట్లు తింటుంది అని కామెంట్ చేశారు. అంతే.. ఆ వీడియో పట్టుకొని రష్మికను చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ కి ఆమె ఏ మాత్రం బాధపడకుండా తానే కుక్కలాగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

45
సోనాక్షి సిన్హా.. బాడీ షేమింగ్...

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా బరువు, ఆమె వెడల్పాటి నుదురు గురించి విపరీతమైన బాడీ షేమింగ్ ఎదుర్కొంది. దానికి ఆమె బాధపడకుండా.. చాలా చక్కగా కౌంటర్ ఇచ్చింది.. ‘ నా నుదురు పెద్దగా ఉంటే ఏమైంది? అక్కడ మీరు కావాలంటే సినిమా హాల్ కట్టుకొని సినిమా చూడొచ్చు’ అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చింది. తన లోపాన్ని తానే హైలెట్ చేసి.. అందరినీ నవ్వించింది.

55
తాప్సీ... మ్యాన్లీ లుక్ పై కౌంటర్

తాప్సీ తన బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ కోసం కష్టపడుతున్న సమయంలో ఒక ట్రోలర్.. ‘ నువ్వు అమ్మాయిలా లేవు, మగాడిలా ఉన్నావ్’ అంటూ కామెంట్ చేశాడు. దానికి తాప్సీ ఏమాత్రం తగ్గకుండా .. తన మజిల్స్ చూపిస్తూ మరో ఫోటో పెట్టి... ‘ అవును, ఒక మగాడి కంటే శక్తి సంపాదించడానికి నేను చాలా కష్టపడుతున్నాను’ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది.

ఈ జాబితాలో ఈ నలుగురు మాత్రమే కాదు.. సమంత, శ్రుతిహాసన్ లాంటి చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. విమర్శలను ఎదుర్కోవడంలో ఈ తరం హీరోయిన్లు చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నారు. కోపంతో కాకుండా హాస్యంతో కౌంటర్ ఇవ్వడం వల్ల, ట్రోలర్లకు మళ్లీ మాట్లాడుకునే ఛాన్స్ ఇవ్వడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories