Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరి మాట వినరు,బద్ధకం ఎక్కువ, భార్యతో ఎప్పుడూ గొడవలే..!

Published : Jun 06, 2025, 04:28 PM IST

ఏ పని అయినా.. ఇప్పుడు కాదు.. తర్వాత చూద్దాం..రేపు చేద్దాం అంటూ వాయిదా వేస్తూ ఉంటారు. అంతేకాదు.. ప్రేమ జీవితంలో కూడా నిలకడ లేకుండా ఉంటారు.

PREV
15
Birth date

జీవితంలో ప్రతి పనిని రేపటికి వాయిదా వేసే వ్యక్తులు మనలో చాలా మంది ఉంటారు. అటువంటివారు ఏ పనినీ సమయానికి చేయరు. చేయాల్సిన సమయంలో ఆ పని చేయకుండా వాయిదా వేసి.. ఆ తర్వాత.. ఆ పని చేయలేకపోయాను అని, ఆలస్యం చేశాను అని చాలా మంది ఫీలౌతారు.వీరి బద్దకం, ఎవరి మాట వినకపోవడం వల్ల వీరితో పాటు.. వీరి స్నేహితులు, బంధువులు కూడా ఇబ్బంది పడతారు. న్యూమరాలజీ ప్రకారం ఇలాంటి లక్షణాలు ఉన్నవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారు ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...

25
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు సోమరిపోతులు...

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 3,5,8,12, 17, 20, 25, 29 తేదీల్లో జన్మించిన అబ్బాయిలు ఎప్పుడూ చాలా దూకుడుగా ఉంటారు. కానీ, పని విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లోనూ పనులు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏ పని అయినా.. ఇప్పుడు కాదు.. తర్వాత చూద్దాం..రేపు చేద్దాం అంటూ వాయిదా వేస్తూ ఉంటారు. అంతేకాదు.. ప్రేమ జీవితంలో కూడా నిలకడ లేకుండా ఉంటారు. ఎప్పుడూ భార్యతో గొడవలు పడుతూ ఉంటారు. దీని ఇంట్లో వారికి సుఖ శాంతులు ఉండవు. వైవాహిక జీవితం గందరగోళంగా, గొడవలతోనే సాగుతుంది.

35
రాశుల వారీగా చూస్తే...

రాశుల పరంగా చూస్తే, మిథునం, కుంభ రాశి వ్యక్తులలో ఈ సోమరితన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వారు ఏ పని మొదలుపెట్టినా.. పూర్తిచేయలేక మధ్యలోనే వదిలేస్తారు. అప్పటికప్పుడే ఉత్సాహంగా కనిపించినా, అతి త్వరగా అలసిపోతారు. దీని వల్ల వారు తమ లక్ష్యాల నుంచి దూరంగా వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

45
చంద్ర గ్రహ ప్రభావం..

2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు చంద్రుడి ప్రభావంలో ఉంటారు. చంద్రుడు మనస్సుకు కారకుడు. వారి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే, వారు ఎప్పుడూ ఆలోచనలలో మునిగిపోయి ఉండడం, చిన్న విషయాలకే మనసు ఒత్తిడికి లోనవ్వడం, పనులపై దృష్టి పెట్టలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది వారి ఆరోగ్యాన్ని, భావోద్వేగ స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.

55
పరిష్కారం ఏంటి..?

ఈ రకమైన అశ్రద్ధ, సోమరితనం వల్ల వ్యక్తిగత జీవితం అస్తవ్యస్తం కావచ్చు. ఇది నివారించాలంటే:రోజువారీ పనుల కోసం టైమ్ టేబుల్ రూపొందించడం ధ్యానం చేయడం ద్వారా మనస్సును నిలకడగా ఉంచడం అవసరం.చిన్న పనులు అయినా సమయానికి పూర్తి చేయడం అలవాటు చేసుకోవడం వంటివి పాటిస్తే మార్పు సాధ్యం అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories