3. గురువులు , పెద్దల పట్ల అగౌరవం:
భారతీయ సంప్రదాయంలో, గురువులను దైవంతో సమానంగా భావిస్తారు. గరుడ పురాణం ప్రకారం, తల్లిదండ్రులు, గురువులు లేదా పెద్దల పట్ల అగౌరవం చూపించే వ్యక్తి సుఖసంతోషాలకు , సంపదకు దూరమవుతాడు. పెద్దలను అగౌరవపరచడం వల్ల ఆ వ్యక్తికి సమాజంలో లభించే గౌరవం తగ్గుతుంది.
4. తప్పుడు దిశలో నిద్రించడం:
గరుడ పురాణం ప్రకారం, మనం నిద్రించే దిశ మన ఆరోగ్యం, దీర్ఘాయువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మనం తల ఉత్తర దిశగా ఉంచి నిద్రించకూడదు. తల ఉత్తర దిశగా ఉంచి నిద్రిస్తే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో గరుడ పురాణంలో వివరించారు. దీని ప్రకారం, తల దక్షిణ దిశగా లేదా నైరుతి దిశగా ఉంచి నిద్రించడం అత్యంత శుభప్రదం.