Marriage numerology
పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికీ చాలా కలలు ఉంటాయి.తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి అలా ఉండాలి.. ఇలా ఉండాలని చాలా ఊహించుకుంటారు. కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలకు కూడా తమ జీవిత భాగస్వామి విషయంలో కొన్ని కోరికలు ఉంటాయి. తమను బాగా ప్రేమించాలని, కోరినవన్నీ తమకు తెచ్చి ఇవ్వాలని, తమకు అన్ని విషయాల్లోనూ అండగా నిలవాలని చాలా కోరుకుంటారు. అయితే.. ఇవన్నీ అందరికీ దక్కకపోవచ్చు. కానీ, ఈ తేదీల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే మాత్రం మీ కోరికలు నెరవేరతాయి. న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన వారు కనుక భార్య లేదా భర్త గా వస్తే వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుందట. ఎందుకంటే వీరు తమ జీవిత భాగస్వామిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారట.మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
Couple
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1,3, 6,8,9,10, 12, 15,17, 18, 19, 21, 24, 26, 27, 28, 30 తేదీల్లో పుట్టిన వారు తమ జీవిత భాగస్వామిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారట.వీరిని చూసినప్పుడు గొప్ప ప్రేమికులు అనే భావన కలగకపోవచ్చు. కానీ, వీరి ప్రేమ మాత్రం స్థిరంగా ఉంటుంది. మొదటి చూపులో ప్రేమ మొదలైనప్పుడు ఎలా ఉంటారో.. తర్వాత తర్వాత ఆ ప్రేమను పెంచుకుంటారే తప్ప, తగ్గించరు.