Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తగారికి స్నేహితులౌతారు
కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు...అత్తగారికి మంచి స్నేహితులు అవుతారట. మరి, ఆ తేదీలేంటో తెలుసుకుందామా...
కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు...అత్తగారికి మంచి స్నేహితులు అవుతారట. మరి, ఆ తేదీలేంటో తెలుసుకుందామా...
అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనే సామేత ఒకటి ఉంది. అంటే.. అత్త కోడళ్లకు అస్సలు పడదని, వారు సంతోషంగా ఉండలేరు అని అందరూ నమ్ముతారు. కానీ... అత్తను సొంత తల్లిలా చూసుకునే కోడళ్లు కూడా ఉన్నారు. కోడలిని కన్న తల్లిలా చూసుకునే అత్తలు కూడా ఉన్నారు. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు తమ అత్తలకు మంచి స్నేహితులు అవుతారట. మరి, ఆ తేదీలేంటో చూద్దాం..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తగారి మెప్పు పొందుతారు. అత్తగారి మనసు గెలిచి ఆ ఇంటిని స్వర్గంగా మారుస్తారు. అత్తగారి తో స్నేహం చేస్తారు. వారికి బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోతారు.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం చాలా మంచిది. వారి మాటలు, మంచి తనం, మంచి గుణగణాల వల్ల అత్తగారి మనసు గెలుచుకుంటారు. కుటుంబంలో అందరినీ ప్రేమగా చూసుకుంటారు. అందుకే, ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తలకు బాగా నచ్చుతారు.
3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తగారి ఇంటికి అదృష్టం తెస్తారు. వాళ్లు వచ్చినప్పటినుంచి ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి. వారు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కుటుంబ సమస్యలు మాత్రమే కాదు, ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయి.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి సహాయపడతారు. భర్తకు కూడా అదృష్టం తెస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.