Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అబ్బాయిలు పదే పదే ప్రేమలో పడిపోతూ ఉంటారు. పెళ్లి తర్వాత కూడా ప్రేమలో పడి.. తమ భాగస్వామిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
న్యూమరాలజీ ప్రకారం.. కేవలం మన భవిష్యత్తు మాత్రమే కాదు.. మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మన అలవాట్లు ఎలా ఉంటాయి..? ఇలా ప్రతి విషయాన్ని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలు వారి జీవితంలో ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంటుందట. అయితే.. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీరు వారి భాగస్వామిని మోసం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. మరి, ఆ తేదీలేంటో ఇప్పుడు చూద్దాం...
23
ఎవరినైనా ఆట్టే ఆకర్షిస్తారు..
ఏ నెలలో అయినా 4, 13, 22 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అంతేకాదు.. చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు. ఈ అబ్బాయిల్లో ఎవరికీ తెలియని ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. వీరి వ్యక్తిత్వానికి అందరూ ఆకర్షితులౌతారు. వీరితో మాట్లాడిన పది నిమిషాలకే ఎవరైనా వీరి మాయలో పడిపోవాల్సిందే.
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. జీవితంలో ప్రేమించిన వారినే పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. వీరి సమస్య ఏమిటంటే.. పదే పదే ప్రేమలో పడిపోతూ ఉంటారు. తమకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తారు. ఎక్కువ మందితో ఎఫైర్లు పెట్టుకుంటారు. దీని కోసం తమ జీవితంలోకి వచ్చిన అమ్మాయిని అంటే భార్యను ప్రతి నిమిషం మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
33
మనసులోనే రహస్యాలు..
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. తమ మనసులోని భావాలను ఇతరులతో అంత సులభంగా పంచుకోరు. తమ జీవితంలో కలిగే బాధలను కూడా వీరు తొందరగా ఎవరితోనూ పంచుకోరు. తమ లోపలే దాచుకుంటారు. అంతేకాదు.. వీరు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, సమస్యలను ఎవరి సహాయం కోరకుండానే ఒంటరిగా ఎదుర్కుంటారు.
ఈ అబ్బాయిలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు.. చాలా చార్మింగ్ గా ఉంటారు. కానీ.. వీరిలో ఎవరికీ తెలియని ఒక లోతైన, రహస్యమైన వ్యక్తిత్వం దాగి ఉంటుంది. అది తొందరగా ఎవరికీ అర్థం కాదు.