ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం చాలా స్పెషల్...
న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 3, 5, 12, 14, 21, 23 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. సహజంగా అందరి మంచి కోరుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు చాలా బాగా మాట్లాడగలరు. వారి మాట తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మారి మనసు కూడా చాలా మృదువుగా, ప్రేమతో నిండి ఉంటుంది. ఇలాంటి లక్షణాలే ఈ అమ్మాయిలను పెళ్లి తర్వాత అందరికీ ప్రియమైన కోడలిగా చేస్తుంది.
అత్తారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే వీరు ఆ ఇంటిని ఆనందంగా మారుస్తారు. ఈ అమ్మాయిలు ఉన్న చోట శాంతి, అనురాగం, సామరస్యం నెలకొంటాయి. భారతీయ సంప్రదాయంలో కోడల్ని లక్ష్మీ దేవిగా భావిస్తారు.సంపద, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు.ఈ అదృష్టమైన తేదీల్లో పుట్టిన వారు ఆర్థిక స్థిరత్వం, శాంతి, ఆనందం వంటి శుభాల్ని ఇంటికి తీసుకురాగలరు.