1వ తేదీ జన్మించిన వారు..
ఏ నెలలో అయినా 1వ తేదీ జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. సాధారణంగా వీరు దేనికి భయపడరు. ఎంత కష్టమైన పనినైనా ఇష్టంగా చేస్తారు. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు. వారు ఎంచుకున్న దారి కష్టంగా ఉన్నా సరే.. వెనకడుగు వేయరు. కష్టపడ్డ వారికే నిజమైన గెలుపు దక్కుతుందని వీరు బలంగా నమ్ముతారు. .
10వ తేదీ జన్మించిన వారు
ఏ నెలలో అయినా 10వ తేదీన పుట్టినవారు సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఒకసారి లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత ప్రపంచం మొత్తం అడ్డుగా నిలిచినా వెనుకడుగు వేయరు. “ఇది అసాధ్యం” అని ఎవరైనా చెప్తే.. దాన్ని సాధ్యం చేసి చూపించే వరకు వదిలిపెట్టరు.