Zodiac Sign: మే 19 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, మంగళుడు(కుజుడు) కలిసి త్వరలో షడాష్టక యోగాన్ని ఏర్పరచనున్నాయి. దీని ప్రభావం 3 రాశులపై బలంగా పడనుంది. షడాష్టక యోగం వల్ల 3 రాశులకు సమస్యలు తప్పవట. ఈ రాశులవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారికి కష్టాలు తప్పవో ఇక్కడ చూద్దాం.

Rahu Mars Shadashtak Yog Impacts 3 Zodiac Signs From May 19 in telugu KVG

మే 19న రాహువు.. మీన రాశిని వదిలి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మంగళుడు.. కర్కాటక రాశిలో ఉంటాడు. రాహువు.. మంగళుడికి 8వ ఇంట్లో, మంగళుడు.. రాహువుకి 6వ ఇంట్లో ఉండటం వల్ల షడాష్టక యోగం ఏర్పడుతుంది. రాహు-మంగళ క్రూర గ్రహాల కలయిక వల్ల ఘర్షణలు, ఉద్రిక్తతలు, సమస్యలు పెరుగుతాయి.

Rahu Mars Shadashtak Yog Impacts 3 Zodiac Signs From May 19 in telugu KVG
మేష రాశి

మేష రాశి వారికి రాహు-మంగళ షడాష్టక యోగం సవాలుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఉద్యోగంలో తప్పులు జరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో సంబంధాలు ఒత్తిడితో కూడుకుని ఉంటాయి. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి.


కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ యోగం మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. తెలియని భయాలు ఎదురుకావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు. ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ రాశి వారు శివుడిని పూజించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. రాహువు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. మంగళుడి దృష్టి ఈ రాశిపై ఉంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు, వివాదాలు పెరుగుతాయి. శివలింగానికి నీటిని అర్పించడం మంచిది.

Latest Videos

vuukle one pixel image
click me!