న్యూమరాలజీ ప్రకారం ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది.ఆ సంఖ్యలకు సంబంధించిన జన్మ తేదీలు మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా ధోరణి, జీవిత విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కాగా, ఈ న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 5, 9, 14, 17, 22, 26 తేదీల్లో జన్మించిన వారు ఏదైనా ముఖం మీదే మాట్లాడేస్తారు. అందరిలా ముందు ఒకలా, వెనక మరోలా మాట్లాడే రకం కాదు.
ఏ నెలలో అయినా నెంబర్ 1 తేదీలో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఏ మాత్రం భయపడరు. వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.