Numerology: ఈ తేదీలలో పుట్టిన వ్యక్తులకు చిన్న వయసులోనే తీవ్ర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువట

Published : Mar 06, 2026, 10:05 AM IST

Birth Date: న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతని భవిష్యత్తును అంచనా వేయవచ్చు. కొన్ని తేదీలలో పుట్టిన వ్యక్తులకు వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.  

PREV
14
ఈ తేదీలలో పుడితే చాలా కష్టం

జ్యోతిష్య శాస్త్రంలో న్యూమరాలజీ కూడా ఒక భాగమే. పుట్టిన తేదీని బట్టి భవిష్యత్తునే కాదు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో కూడా సంఖ్యాశాస్త్రం అంచనా వేయగలదు. రెండు గ్రహాల ప్రతికూల ప్రభావం పడితే ఆ వ్యక్తికి డయాబెటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులు వస్తాయని ముందే ఊహించవచ్చు. ముఖ్యంగా బృహస్పతి, శుక్రుడు ఈ రెండు గ్రహాల వల్ల మధుమేహం వంటి దీర్ఘకాల వ్యాధులు త్వరగా వస్తాయిట. ఏ తేదీలలో పుట్టిన వారికి చిన్నప్పుడే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మొదలయ్యే అవకాశం ఉందో న్యూమరాలజీ వివరిస్తోంది.

24
మూల సంఖ్య 2

సంఖ్యా శాస్త్రం ప్రకారం రాడిక్స్ సంఖ్య 2 కలవారికి మధుమేహం చిన్న వయసులోనే రావచ్చు. అంటే ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 2 అవుతుంది. ఇలాంటి వారికి చిన్న వయసులోనే మధుమేహం రావచ్చు. ఆరోగ్యకరమైన చెడు అలవాట్లు వీరికి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

34
మూల సంఖ్య 3

ఏ నెలలోనైనా 3, 12,21, 30 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 3 అవుతుంది. మూడు సంఖ్యకు అధిపతి బృహస్పతి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహం అనేది ఊబకాయానికి కారణం అవుతుంది. గురు గ్రహం సరైన స్థానంలో లేకపోతే లేదా జాతకంలో బలహీనంగా ఉంటే అది వ్యాధులకు కారణమవుతుంది. శరీరంలో చక్కెర అసమతుల్యత ఏర్పడవచ్చు. దీనివల్ల కూడా దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు.

44
మూల సంఖ్య 6

ఏ నెలలోనైనా 6,15, 24 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 6 అవుతుంది. 6 సంఖ్యకు అధిపతి శుక్ర గ్రహం. శుక్రుడు బలహీనంగా ఉంటే హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి. దీని వల్ల మధుమేహం, థైరాయిడ్, పిసిఒడి వంటి వ్యాధుల ప్రమాదం పెరిగిపోతుంది. ఇదే కాదు రాడిక్స్ సంఖ్య 3, 6 కలవారు.. అధికంగా భోజన ప్రియులుగా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి తింటూ, తాగుతూ ఉంటారు. దీని వల్ల కూడా వారు బరువు త్వరగా పెరిగిపోయి దీర్ఘకాలిక వ్యాధుల పడవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories