Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు మంచి నాయకులు అవుతారు..!
ఒక్కో తేదీ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మరి, ఏ తేదీల్లో పుట్టినవారు జీవితంలో మంచి నాయకులు అవుతారో తెలుసుకుందాం..
ఒక్కో తేదీ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మరి, ఏ తేదీల్లో పుట్టినవారు జీవితంలో మంచి నాయకులు అవుతారో తెలుసుకుందాం..
న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా ఆ వ్యక్తి లక్షణాలు, అభిరుచులు తెలుసుకోవచ్చు. ఒక్కో తేదీ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మరి, ఏ తేదీల్లో పుట్టినవారు జీవితంలో మంచి నాయకులు అవుతారో తెలుసుకుందాం..
1.నెంబర్ 5
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు మంచి నాయకులు అవుతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మంచి మార్గదర్శకులు.తమ చుట్టూ ఉన్నవారికీ.. మార్గనిర్దేశం చేయడంలో ముందుంటారు. వారు మార్పులకు అనుగుణంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలపడతారు.చాలా ధైర్యంగా ఉంటారు.తమ పక్కన వారిని కూడా ప్రోత్సహిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.
2.నెంబర్ 2..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు కూడా మంచి నాయకులు అవుతారు.వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. ఈ తేదీల్లో పుట్టిన వారు తాము జీవితంలో ఎదగడమే కాదు, తమ తోటివారు, స్నేహితులు, బంధువులు కూడా ఎదగడానికి సహాయం చేస్తారు. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు వివరించి చెబుతారు.నిత్యం కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు.ఈ తేదీలో పుట్టినవారు పుట్టుకతోనే ట్రెండ్ సెట్టర్లు. వారు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు.
3. నెంబర్8..
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు కూడా మంచి దార్శనికులు అవుతారు. బలమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.ఈ తేదీల్లో పుట్టిన వారు విజయం సాధించాలనే తపన చాలా ఎక్కువగా ఉంటుంది. లైఫ్ లో ఎలాంటి రిస్క్ వచ్చినా ఎదుర్కొవడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. దేనికీ భయపడరు.మంచి వ్యూహకర్తలు. క్లిష్ట పరిస్థితులను విజయవంతంగా అధిగమించగలుగుతారు. చివరకు విజయం సాధిస్తారు.
4.నంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు కూడా సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి చాలా సృజనాత్వకత కలిగి ఉంటారు. వీరికి ఓ ప్రత్యేకత లక్షణం ఉంటుంది. దాని ప్రకారం.. తమకు భవిష్యత్తులోరాబోయే అడ్డంకులను కూడా వీరు గుర్తించగలరు. దానికి తగినట్లే.. ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.