జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారాలు, వక్ర గమనాలు మనుషుల జీవితాల్లో రకరకాల మార్పులు తీసుకొస్తాయి. అక్టోబర్ 6న శుక్రుడు తుల రాశిలో వక్ర సంచారం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 21న బుధుడు కూడా అదే రాశిలో వక్ర గమనంలోకి వెళ్తాడు. ఇలా ఒకే రాశిలో ఈ రెండు గ్రహాలు వక్రించడం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైన సంఘటన. బుధుడు తెలివితేటలు, మాటతీరు, విద్య, వ్యాపారానికి కారకుడు. శుక్రుడు సంపద, సౌకర్యం, ప్రేమ, కళలు, విలాసవంతమైన జీవితానికి ప్రతీక. అందుకే, ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా, సంబంధాల్లో మంచి మార్పులు తీసుకురానుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.