శని దేవుడు సుతిమెత్తని దారిని చూపించడని, కఠినమైన పాఠాల ద్వారా జీవితం ఎలా సాగించాలో నేర్పిస్తాడని జ్యోతిష నిపుణులు చెబుతారు. అయినా, 8వ సంఖ్యవారు మంచి పనులు చేస్తే, ధార్మికంగా జీవిస్తే శని అనుగ్రహం వారి జీవితాన్ని మారుస్తుంది. ఎప్పుడూ కర్మపై నమ్మకం ఉంచే వారు, శ్రమను మించిన ఫలితాలు పొందుతారు.
ఈ తేదీల్లో పుట్టిన వారికి కలిసొచ్చే రంగులు..
నీలం రంగు (Neelam) – శనికి ప్రీతికరమైన రంగు. ముఖ్యమైన రోజుల్లో నీలం రంగు దుస్తులు ధరించడం మంచిది.
శనివారం ఉపవాసం – శనివారాల్లో నియమంగా శని వ్రతం చేయడం శుభప్రదం.
నల్ల నువ్వులు దానం – నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దానం చేయడం శని అనుగ్రహానికి మార్గం.
ఫైనల్ గా...
8, 17, 26 తేదీల్లో జన్మించినవారు కేవలం అదృష్టవంతులే కాకుండా, శ్రమ, నిబద్ధత, సమర్థత కలిగి ఉంటారు. శని అనుగ్రహం పొందాలంటే నీతి మార్గంలో నడవాలి, నిజాయితీతో జీవించాలి. అప్పుడు ఈ సంఖ్యవారు జీవితంలో నిజమైన విజయాలను సాధించగలరు – పేరుప్రఖ్యాతులు, సంపద, గౌరవం అన్నీ తగిన సమయంలో లభిస్తాయి.