ఆగస్టు 21 నుండి శుక్రుడి వల్ల ఈ రాశుల వారు మట్టి ముట్టుకున్నా బంగారమైపోతుంది

Published : Aug 10, 2025, 07:47 AM IST

ఆగస్టు నెలలో శుక్రుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. చంద్రుని రాశి అయినా కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం వల్ల మూడు రాశుల వారికి విపరీతంగా కలిసివచ్చే అవకాశం ఉంది.

PREV
15
శుక్రుడి సంచారం

ఆగస్టు నెల 21 నుండి కొన్ని రోజులు వారికి మంచి రోజులు మొదలవుతున్నాయి. శుక్రుడు తన గమనాన్ని మార్చి వారికి ఎన్నో ప్రయోజనాలను అందించబోతున్నాడు. శుక్రుడి రాశి సంచారం లేదా నక్షత్ర మార్పు అనేది అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశులపై చెడు ప్రభావం పెడితే మరికొన్ని రాశులపై మంచి ప్రభావం పడుతుంది.

25
చంద్రుని రాశిలోకి

చంద్రుని రాశి అయిన కర్కాటక రాశిలోని శుక్ర సంచారం వల్ల మూడు రాశుల వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడు ఆగస్టు 21వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట 25 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడే సెప్టెంబర్ 15 వరకు ఉంటాడు. శుక్రుడు కర్కాటక రాశిలోకి వెళ్లడం వల్ల మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

35
మేష రాశి

కర్కాటక రాశిలో శుక్రుని సంచారం మేష రాశి వారికి ఎంతో మంచిది. శుక్రుని ప్రభావం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. డబ్బులు చేతికంటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యాన్ని మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఒత్తిడికి దూరంగా ఉంటే ఉత్తమం.

45
మిథున రాశి

మిథున రాశి వారికి శుక్ర సంచారం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వారు ఈ సమయంలో ప్రారంభించిన పని కచ్చితంగా విజయవంతమవుతుంది. తోబుట్టువులతో ఉన్న గొడవలు, చికాకులు తొలగిపోవడం ప్రారంభమవుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది.

55
ధనస్సు రాశి

శుక్రుని రాశిలో మార్పు వల్ల ధనస్సు రాశి వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఆగస్టు 21 నుండి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో మధురమైన బంధాన్ని కొనసాగిస్తారు. మీరు వ్యాపారంలో చాలా కాలం క్రితం పెట్టిన పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.

Read more Photos on
click me!

Recommended Stories