Zodiac signs: ఈ రాశులవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశం చాలా ఎక్కువ

Published : Apr 08, 2025, 04:34 PM IST

జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వ్యక్తులు ఒక్క పెళ్లితో తృప్తి చెందరు. సంబంధాలలో స్థిరత్వం, శాంతి, ప్రేమ, స్వేచ్ఛ లాంటివి కోరుకుంటారు. అలాంటివి దొరకకపోతే వారు రెండో పెళ్లి వైపు మొగ్గు చూపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొదటి పెళ్లిలో అసంతృప్తి ఉంటే వారు సర్దుకోరు, కచ్చితంగా కొత్త భాగస్వామి కోసం ముందడుగు వేస్తారు.    

PREV
15
Zodiac signs: ఈ రాశులవారు  రెండో పెళ్లి చేసుకునే అవకాశం చాలా ఎక్కువ


జోతిష్యశాస్త్రం ప్రకారం, మన ప్రేమ జీవితం, పెళ్లిపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. గ్రహాలలో మార్పులు, మనం పుట్టిన సమయం, మన రాశులను బట్టి.. ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. దీని ప్రకారమే.. కొన్ని రాశులవారి వైవాహిక జీవితం సరిగా ఉండకపోవచ్చు. అలాంటి రాశులు రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

25
telugu astrology

1.వృషభ రాశి...
వృషభ రాశివారు ప్రేమ, వైవాహిక జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి తమ కష్టాల్లో తోడు ఉండాలని కోరుకుంటారు. కానీ తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి..తమ అవసరాలకు అనుగుణంగా మానసికంగా సపోర్ట్ గా లేకపోతే మాత్రం ఆ బంధాన్ని వదులుకోవడానికి ఏ మాత్రం వెనకాడరు. రెండో పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడరు.

35
telugu astrology

2.తుల రాశి..
తుల రాశి వారు శాంతి, సమతుల్యత కోరుకుంటారు.అందరితో మంచిగా కలిసిపోయే వాళ్లు, తమ కుటంబంతో ఆనందంగా ఉండేవాళ్లు తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు. అలా కాకుండా.. ఎప్పుడూ గొడవలు పడుతూ, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని దూరం చేసే వాళ్లు తమ జీవితంలోకి వస్తే, ఆ బంధాన్ని వదులుకుంటారు. మరోసారి మంచి వాళ్లు దొరికితే రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. సహజంగా బంధాన్ని వదులుకునే మనస్తత్వం ఈ రాశివారిది కాదు. కానీ..మొదటి పెళ్లిలో ఆ హార్మోనీ లేకపోతే, కొత్త ఆరంభం చేయాలని భావించే అవకాశం ఉంటుంది.

45
telugu astrology

3.వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారికి ప్రేమ జీవితం ఎంతో ముఖ్యమైనది. నిజమైన అనుబంధం, శ్రద్ధ అవసరం. కానీ, మొదటి పెళ్లిలో వారి భావోద్వేగాలను గుర్తించకపోతే, వారు పూర్తిగా దూరమై, మరో సంబంధానికి అవకాశమివ్వవచ్చు.
 

55
telugu astrology

4.ధనస్సు రాశి..
ధనుస్సు రాశి వారు స్వేచ్ఛను అత్యంత ప్రాధాన్యంగా భావిస్తారు. పెళ్లిలో బంధనంగా, నియంత్రణగా అనిపిస్తే, వారు ఆ బంధాన్ని వీడి, స్వేచ్ఛను కలిగించే వ్యక్తిని ఆశ్రయించవచ్చు. అంటే, తమను ప్రతి విషయంలో కంట్రోల్ చేయాలని చూస్తే, ఆ బంధాన్ని వదులుకుంటారు. తమను తమలా బతకనిచ్చేలా ఉండే వ్యక్తితో మాత్రమే వీరు జీవితాంతం ఉంటారు. లేదంటే రెండో పెళ్లి చేసుకోవడం ఖాయం.

గమనిక: ఇవన్నీ సాధ్యమయ్యే పరిస్థితులు మాత్రమే. నిజజీవితంలో ఇలాంటి నిర్ణయాలు అనేక కారణాలపై ఆధారపడి ఉంటాయి. జాతక విశ్లేషణ వలన మాత్రమే స్పష్టత వస్తుంది. మీరు లేదా మీ స్నేహితులు ఇలాంటి అంశాలపై కన్ఫ్యూజన్‌లో ఉంటే, నిపుణుడిని సంప్రదించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories