జోతిష్యశాస్త్రం ప్రకారం మనం పుట్టిన తేదీ, సమయం ఆధారంగా మన జాతకం తెలుసుకోవచ్చు. ఇక.. ఆ జాతకం ఆధారంగా వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుంది? పెళ్లి, ఉద్యోగం, కెరీర్, ఆరోగ్యం, సంపద లాంటి విషయాల గురించి తెలుసుకోవచ్చు. అందుకే చాలా మంది తమ జాతకం రాయించుకుంటూ ఉంటారు. మన జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా.. వాటిని ఎలాంటి పరిహారాలు చేయించాలి లాంటి విషయాలు తెలుసుకోవాలన్నా జాతకం రాయించుకోవాలి. మరి, ఈ జాతకాన్ని పిల్లలకు ఏ వయసులో రాయించాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
25
జాతకం రాయించే పద్దతులు...
సాధారణంగా జాతకం రాయడానికి రెండు పద్ధుతులు ఉన్నాయి. కొందరు తమ ఇంట్లో పిల్లలు పుట్టిన వెంటనే జాతకం రాయించేస్తూ ఉంటారు. ఇలా చిన్నప్పుడే రాపిస్తే.. పిల్లల రాశి, నక్షత్రం, ప్రారంభ జీవితం తెలుసుకోవడానికి సహాయపడతుంది. వారి నక్షత్రం ఆధారంగా ఎలాంటి పేరు పెట్టాలి అనే విషయం కూడా తెలుస్తుంది. ఇక కొందరు తమ పిల్లలకు 10, 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు జాతకాన్ని రాయించకూడదు అనే నమ్మకం ఉంటుంది. ఈ విషయం గురించి ప్రముఖ ఆధ్మాత్మిక వక్త దేశ మంగైయర్కరసి చెప్పారు.
35
జాతకం ఎప్పుడు రాయించాలి?
“మీరు ఒక జ్యోతిష్యుడిని సంప్రదించి మీ పిల్లలు పుట్టిన వెంటనే అతనికి సమయం చెప్తే, అతను మీకు రాశి, నక్షత్రం సహా ప్రతిదీ చెబుతాడు. కానీ ఈ సమాచారం ఆధారంగా జాతకం ఎప్పుడు రాయాలనే దాని గురించి కొన్ని సాధారణ నియమాలు ఉన్నాయి. కొన్ని కుటుంబ సంప్రదాయాలలో, పిల్లలు పుట్టిన వెంటనే జాతకం రాయడం ఆచారం. ఆ ఆచారం ఉన్నవారు కుటుంబ సంప్రదాయాన్ని మర్చిపోకూడదు. వారి పూర్వీకులు వారికి నేర్పించిన వాటిని మార్చకూడదు. అదే సమయంలో, అలాంటి కుటుంబ సంప్రదాయాలు తెలియని వారు సాధారణ నియమాలను పాటించాలి.’’ అని ఆమె చెప్పారు.
12 సంవత్సరాల వయస్సు వరకు ప్రయోజనాలు కనిపించకపోవచ్చు.
‘ అబ్బాయి అయినా లేదా అమ్మాయి అయినా, బిడ్డకు ఒక సంవత్సరం వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే జాతకం రాయించాలి. ఏవైనా దోషాలు ఉన్నా వెంటనే పరిహారాలు చేయించడం లాంటివి చేయకూడదు. కనీసం పిల్లలకు రెండు, మూడు సంవత్సరాలు వచ్చే వరకు ఆగాలి. ఆ తర్వాత ఏవైనా పరిహారాలు చేయించాలి. చాలా మంది జ్యోతిష్కులు చిన్న పిల్లలకు ఫలితాలను ఇవ్వరు. ఏదైనా ఆరోగ్య సమస్య లేదా ఇతర సమస్య ఉంటే మాత్రమే, పిల్లల జాతకాన్ని చూపించాలి. ఎలాంటి సమస్యలు రాకపోతే.. 12 ఏళ్ల తర్వాత జాతకం రాయించకపోవడమే మంచిది’ అని ఆమె చెప్పారు.
55
అవసరమైతే మాత్రమే చూడండి...
అయితే, అమ్మాయిలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అమ్మాయిలకు యుక్త వయసు వచ్చే వరకు జాతకం చూపించకుండా ఉండటమే మంచిది. .జాతకాన్ని రాయించిన తర్వాత దానిని పూజ గదిలో లేదంటే.. లాకర్ లో దాచుకోవడం మంచిది.