ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకి గయ్యాళి భార్య వస్తుంది!

Published : Aug 26, 2025, 06:51 PM IST

పెళ్లి చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనది. పెళ్లి బంధంలో ఇద్దరు వ్యక్తులు కరెక్టుగా ఉంటేనే ఆ బంధం సంతోషంగా, సాఫీగా సాగుతుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళి భార్యలు వస్తారట. ఆ తేదీలేంటో చూద్దామా.. 

PREV
14
పుట్టిన తేదీ ప్రకారం..

సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, వృత్తి, ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళి భార్యలు వస్తారని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందో ఓసారి చూసేయండి.  

24
3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు..

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారి మూలసంఖ్య 3. దీనికి అధిపతి గురువు. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకి గొడవలు పెట్టుకునే భార్యలు వస్తారని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు భార్యకే ఇంటి పెత్తనం ఇస్తారు. పొరపాటున కూడా వారి నిర్ణయాలకు ఎదురు చెప్పరు. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఇద్దరి మధ్య గొడవలు తప్పవు. 

34
2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు..

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా  2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి మూలసంఖ్య 2. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలను వారి భార్యలు కంట్రోల్ చేస్తారు. వీరు భార్య మాట కచ్చితంగా వింటారు. వారి సలహా, అనుమతి లేకుండా ఏ పని చేయరు. ఈ తేదీల్లో పుట్టిన వారు భార్యకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోలేరు. 

44
5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు..

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారి మూలసంఖ్య 5. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు చాలా కఠినమైన మనస్తత్వం ఉన్న అమ్మాయిలు భార్యగా వస్తారు. వీరు భర్తలను చాలా ఇబ్బంది పెడతారు. ఎప్పుడూ తమదే పైచేయి ఉండాలనుకుంటారు. భర్త అభిప్రాయాలకు వీరు ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వరు.

Read more Photos on
click me!

Recommended Stories