Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం కొన్ని మూలాంకాలు కలిగిన వారికి జీవితాన్ని కొత్త దిశలో నడిపించే శక్తిని ఇస్తుంది. కెరీర్, ఆర్థిక స్థితి, వ్యక్తిగత ఎదుగుదల పరంగా కీలక మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అవేంటంటే..
మూలాంకం 1 ఉన్నవారికి 2026లో గుర్తింపు లభించే కాలం. ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారం చేస్తున్నవారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచనలకు మద్ధతు లభిస్తుంది. నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
26
నంబర్ 2: సంబంధాలు, స్థిరత్వం
మూలాంకం 2 ఉన్నవారికి ఈ సంవత్సరం భావోద్వేగ సమతుల్యతను ఇస్తుంది. వ్యక్తిగత సంబంధాలు బలపడే అవకాశం ఉంది. పని రంగంలో స్థిరత్వం వస్తుంది. మీడియా, డిజైన్, కౌన్సెలింగ్, పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాల్లో ఉన్నవారు ముందడుగు వేయగలరు. సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి.
36
నంబర్ 4: కీలక మలుపు
మూలాంకం 4 ఉన్నవారికి 2026 కీలక మలుపులు తీసుకొస్తుంది. జీవితం కొత్త అవకాశాల వైపు మళ్లే సూచనలు ఉన్నాయి. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, అసాధారణ రంగాల్లో పని చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో కొంత అనిశ్చితి కనిపించవచ్చు. వీరు వచ్చే ఏడాది ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఉంది.
మూలాంకం 5 ఉన్నవారికి ప్రయాణాలు, కొత్త పరిచయాలు జీవితంలో ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. ఉద్యోగ మార్పు, పదోన్నతి అవకాశాలు కనిపిస్తాయి. స్వతంత్రంగా పని చేయాలనుకునేవారికి అనుకూల కాలం. కుటుంబ బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి.
56
నంబర్ 7: ఈ రంగాల్లో వారికి పురోగతి
మూలాంకం 7 ఉన్నవారికి 2026లో ఆలోచనా లోతు పెరుగుతుంది. జ్ఞానం, పరిశోధన, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారికి పురోగతి కనిపిస్తుంది. రచయితలు, ఉపాధ్యాయులు, పరిశోధకులు మంచి ఫలితాలు పొందగలరు. యోగా, ధ్యానం, ప్రకృతితో సమయం గడపడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
66
మూలాంకం ఎలా లెక్కిస్తారు.?
మూలాంకం లెక్కించే విధానం చాలా సులువుగా ఉంటుంది. మీ పుట్టిన తేదీలో ఉన్న తేదీ సంఖ్యను తీసుకోవాలి. రెండు అంకెల సంఖ్య అయితే వాటిని కలిపితే వచ్చే సంఖ్యను మూలాంకం అంటారు. ఉదాహరణకు పుట్టిన తేదీ 5 అయితే మూలాంకం 5 అవుతుంది. అదే విధంగా పుట్టిన తేదీ 14 అయినా మూలంకం 1 + 4 = 5 అవుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందిచడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.