జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారి ఆలోచన మెరుపులా ఉంటుంది. క్షణాల్లో నిర్ణయం తీసుకుంటారు. ఎదురుచూడటం కన్నా ముందుకు దూసుకుపోవడమే మంచిదనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. మరి వేగానికి ప్రతీకలైన ఆ నక్షత్రాలేంటో చూద్దామా…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల్లో జన్మించిన వారికి వేగం, చురుకుదనం, తక్షణ నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచనలు, మాటలు, చర్యలు చాలా వేగంగా ఉంటాయి. వీరి వేగాన్ని అందుకోవడం చాలా కష్టం. మరి ఆ సూపర్ ఫాస్ట్ గా నక్షత్రాలేంటో.. వారి వ్యక్తిత్వ లక్షణాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
అశ్విని నక్షత్రం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశ్విని నక్షత్రం అత్యంత వేగవంతమైన నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినవారు ఏదైనా పని మొదలుపెట్టాలంటే ఆలస్యం చేయరు. నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయడం రెండూ ఒకేసారి జరుగుతాయి. వీరి నడక, మాట, కోపం, ప్రేమ అన్నీ ఫాస్ట్ మోడ్‌లోనే ఉంటాయి. కొత్త విషయాలు మొదలుపెట్టడంలో వీరిని మించినవారు లేరు.
36
భరణి నక్షత్రం
భరణి నక్షత్రం కూడా తీవ్ర వేగానికి ప్రతీక. ఈ నక్షత్రాల్లో జన్మించినవారు ఏ విషయాన్ని లోపల దాచుకోరు. వెంటనే బయటకు చెప్పేస్తారు. వీరి చర్యలు అకస్మాత్తుగా ఉంటాయి. కానీ చాలా బలంగా ఉంటాయి. వీరికి ఓపిక తక్కువ. ఒకసారి నిర్ణయించుకుంటే ఎవరూ ఆపలేని వేగంతో ముందుకు దూసుకుపోతారు.
మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి మనసు నిశ్చలంగా ఉండదు. ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వేగంగా మారుతుంటాయి. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు, కొత్త ఐడియాల పట్ల వీరికి విపరీతమైన ఆసక్తి ఉంటుంది. చాలా చురుకుగా ఉంటారు. ఒక చోట ఎక్కువసేపు ఉండలేరు.
56
ఆరుద్ర నక్షత్రం
ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. వీరి బ్రెయిన్ మెరుపులా పనిచేస్తుంది. ఒక సమస్యను ఇతరులు అర్థం చేసుకునేలోపే వీరు పరిష్కారం కనుక్కుంటారు. ఈ వేగం వల్లే కొన్నిసార్లు ఎదుటివారికి షాక్ ఇచ్చే మాటలు మాట్లాడుతారు.
66
హస్త నక్షత్రం
హస్త నక్షత్రంలో పుట్టినవారు పనిలో వేగానికి ప్రసిద్ధి. చేతులతో చేసే పనుల్లో వీరు అద్భుతమైన స్పీడ్ చూపిస్తారు. టైపింగ్, రాయడం, డిజైన్, మెకానికల్ వర్క్, మేనేజ్‌మెంట్ లాంటి రంగాల్లో వీరి వేగం కనిపిస్తుంది. ఒకేసారి ఎక్కువ పనులు చేయగలిగే శక్తి వీరిలో ఉంటుంది.
స్వాతి నక్షత్రం
స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు స్వేచ్ఛను కోరుకుంటారు. వీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఫాస్ట్‌గా ఉంటారు. కొత్త మార్పులకు వెంటనే అడ్జస్ట్ అవుతారు. ఒకే చోట ఆగిపోవడం వీరికి ఇష్టం ఉండదు. ఎక్కడికైనా వేగంగా వెళ్లగలిగే స్వభావం వీరిది.