November 2026 Horoscope: నవంబర్ లో ఈ రాశులవారికి అదృష్టం! డబ్బు, ఉద్యోగం, పెళ్లి విషయంలో శుభవార్తలు!

Published : Oct 31, 2026, 07:00 AM IST

November 2026 Horoscope: ఈ మాస ఫలాలు నవంబర్ నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నవంబర్ మాస ఫలాలు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

నవంబర్ నెల మేష రాశివారికి అనుకూలమైన ఫలితాలను అందించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లాలి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ జీవితంలో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది.

313
వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి నవంబర్ నెలలో ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేపట్టే అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు చేయాలని లేదా స్థలం కోసం ప్రయత్నిస్తున్న వారు అన్ని వివరాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులకు పనిభారం పెరిగినప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు కొత్త పరిచయాల ద్వారా భవిష్యత్తులో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ కుటుంబ అవసరాలు, ఇంటి ఖర్చులు పెరగవచ్చు. దాంపత్య జీవితంలో చిన్నచిన్న సమస్యలు ఎదురైనా పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవచ్చు. ప్రేమికులకు అనుకూలమైన సమయం. విద్యార్థులు లక్ష్యంపై దృష్టి పెట్టాలి.

413
మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి నవంబర్ నెలలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మీడియా, రచన, కమ్యూనికేషన్, మార్కెటింగ్ రంగాల్లో పనిచేసేవారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సోదరులు, స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి.ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

513
కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి నవంబర్ నెలలో ఆర్థిక విషయాల్లో కొంత ఊరట కలుగుతుంది. ఉద్యోగులకు తమ పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఆదాయ మార్గాలపై ఆలోచనలు రావచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నప్పటికీ రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో పరస్పర సహకారం పెరుగుతుంది. ప్రేమికులు తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి.

613
సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి నవంబర్ నెలలో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు రావచ్చు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు లేదా ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఇతరుల మాటలు విని పెట్టుబడులు పెట్టకుండా పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆర్థికంగా కొంత పురోగతి కనిపించినప్పటికీ అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ వ్యవహారాల్లో మీ అభిప్రాయాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దకుండా ఉండటం మంచిది. దాంపత్య జీవితంలో చిన్నపాటి వాదనలు రావచ్చు. ఆరోగ్యపరంగా చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

713
కన్య రాశి ఫలాలు

కన్య రాశివారు నవంబర్ నెల ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. పనుల్లో ఆలస్యం జరిగినా నిరుత్సాహపడకుండా ఓపికగా ముందుకు సాగాలి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు మార్కెట్ పరిస్థితులను పరిశీలించాలి. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్నచిన్న విషయాలకు గొడవలు పడకుండా సంయమనంతో వ్యవహరించాలి. విద్యార్థులు చదువులో క్రమశిక్షణ పాటించాలి.

813
తుల రాశి ఫలాలు

తుల రాశివారికి నవంబర్ నెల ఆదాయం, స్నేహ సంబంధాలు, సామాజిక పరిచయాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు తమ పనితీరుతో మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులకు పరిచయాల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లపై ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి నవంబర్ నెల ఉద్యోగ, వృత్తి పరమైన విషయాల్లో కీలకంగా ఉంటుంది. తమ పనితీరుతో ఇతరుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. అయితే భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు స్పష్టత అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నప్పటికీ ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత పాటించాలి. కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ టైం కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తకుండా ప్రశాంతంగా మాట్లాడటం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి నవంబర్ నెలలో అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులను కలిసే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

1113
మకర రాశి ఫలాలు

మకర రాశివారు నవంబర్ నెలలో ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కానీ క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. వ్యాపారులు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్పులు, పన్నులకు సంబంధించిన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అవసరం. ప్రేమలో అనవసర అనుమానాలకు తావివ్వకూడదు.

1213
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారు నవంబర్ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఇతరులతో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒప్పందాలు చేసుకునే ముందు నిబంధనలను పూర్తిగా చదవాలి. ఆర్థికంగా పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ ఇతరుల కోసం డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామితో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త సంబంధాల గురించి సమాచారం అందుతుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

1313
మీన రాశి ఫలాలు

మీన రాశివారికి నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు తమ పనుల్లో మరింత క్రమశిక్షణ పాటించాలి. ఉద్యోగం మారాలి అనుకునేవారు సరైన అవకాశాల కోసం వేచి చూడాలి. వ్యాపారులు పాత బాకీల వసూళ్లపై దృష్టి పెట్టడం మంచిది. ఆర్థికంగా ఆదాయం, ఖర్చులను సమన్వయం చేసుకోవడం ముఖ్యం. అప్పులు తీసుకునే ముందు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. ప్రేమ జీవితంలో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. విద్యార్థులు చదువులో ఎదురయ్యే ఇబ్బందులను పట్టుదలతో అధిగమిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories