సింహరాశి వారికి చంద్ర గజకేసరి రాజయోగం అనేక రంగాలలో ప్రత్యేక విజయాలను అందిస్తుంది. గజకేసరి రాజయోగ ప్రభావం కారణంగా, మీరు ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు. మీ పనిని కుటుంబం, స్నేహితులు , సహోద్యోగులు అభినందిస్తారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ కాలంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. చేసే పనుల్లో విజయం సాధించగలరు. కార్యాలయంలో మీ సామర్థ్యం , అంకితభావం కారణంగా మీరు వేరే గుర్తింపును పొందవచ్చు. అధికారులు మీ సామర్థ్యాన్ని అభినందిస్తారు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి.