
2026 సంవత్సరం మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చే సంవత్సరం. కొన్ని రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ఉంటుంది. ఏడాది మొదటి నెలల్లోనే గ్రహస్థితులు కొంత ఒత్తిడిని కలిగించినా మధ్య నెలల్లో, చివరి నెలల్లో పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి. ఈ సంవత్సరం మీరు శక్తిమంతంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో గ్రహస్థితి కాస్త సవాళ్లను తెచ్చినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు పెద్దవి కావు. మొత్తం మీద ఇది మెష రాశి వారు ఈ ఏడాది శాంతిగా, జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన సంవత్సరం 2026.
ఆరోగ్యం విషయానికి వస్తే 2026లో మెష రాశి ఆరోగ్యం సాధారణంగా ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా వీరికి నిద్ర సమస్యలు, కాళ్లు నొప్పులు, మానసిక అలసట వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జీవనశైలిని మెరుగుపరుచుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం, తేలికపాటి ఆహారం, ఒత్తిడి తగ్గించే అలవాట్లు చాలా అవసరం. మే నెల తర్వాత ఆరోగ్యం కొంచెం సర్దుతుంది. ఈ ఏడాది ఆరోగ్యం కోసం డాక్టర్ చెకప్‌లు, రొటీన్ టెస్ట్‌లు చేయించడం ఉపయోగకరం.
విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత ఇబ్బంది పడే ఏడాది. చదువులో ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుత్సాహం, ఏకాగ్రత కుదరకపోవడం, ఇతర విషయాల వైపు ఆకర్షితులవ్వడం వంటివి కొంత ఒత్తిడిని పెంచవచ్చు. అయినా శ్రమ, పట్టుదల ఉంటే మంచి ఫలితాలు సాధ్యమే. ఉపాధ్యాయుల సహకారం, కుటుంబం నుండి సపోర్ట్ తీసుకుంటూ చదివితే అవరోధాలు క్రమంగా తగ్గుతాయి. సంవత్సరాంతంలో విద్యార్థులకు మంచి అవకాశాలు కనిపిస్తాయి. విదేశాల్లో చదవాలన్న ఆశ ఉన్నవారు నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.
ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో ఈ సంవత్సరం సాధారణంగానే గడుబస్తుంది. ఉద్యోగస్తులకు కష్టపడి పని చేసినా ఫలితాలు అంతగా రావు. పదోన్నతులు, వేతన వృద్ధి వంటివి ఆలస్యమవుతాయి. ఇవి సంవత్సరంలోని ద్వితీయార్థంలో దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునేవారు కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. వ్యాపారస్తులు కూడా ఈ ఏడాది జాగ్రత్తతో ముందుకు వెళ్లాలి. పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విదేశీ వ్యాపారం ఉన్నవారికి కొంచెం మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత, పారదర్శకత ఉండటం చాలా ముఖ్యం. చిన్న చిన్న ఆర్థిక ఒత్తిడులు ఉన్నప్పటికీ, సంవత్సరం చివరి భాగంలో ఆదాయం కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది.
ప్రేమ, వివాహం, కుటుంబ జీవితం విషయాల్లో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ప్రేమజంటల మధ్య కొంత అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి జూన్ 2 వరకు మంచి సమయం ఉంటుంది. అలాగే సంవత్సరం చివర్లో కూడా వివాహ ఘడియాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు వచ్చినా, అవి పెద్ద సమస్యలుగా మారవు. మెల్లగా, శాంతంగా మాట్లాడితే విషయాలు సర్దుకుంటాయి. మొత్తం మీద సంబంధాలు, కుటుంబ జీవితం నిలకడగా ఉండాలంటే సహనం చాలా అవసరం. ఎదుటివారిని అర్థం చేసుకోవాలి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశమూ ఉంది.