ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సమాజంలోనూ, పని ప్రదేశంలోనూ మీ వాక్చాతుర్యం బాగా పనిచేస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. మీ జీవిత భాగస్వామి కూడా కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు.
వృశ్చిక రాశి:
సెప్టెంబర్ నెలలో మీకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వస్తాయి. మనస్సులోని భయాలు, సంకోచాలు తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, విదేశీ వ్యాపారం చేసే వారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది.