ఈ రాశివారు భాగస్వాముల్ని.. అపురూపంగా, మహారాణుల్లా చూసుకుంటారు..

First Published | Apr 5, 2022, 11:25 AM IST

ప్రతీ మహిళ తన భాగస్వామి తనను మహారాణిలా చూసుకోవాలని కోరుకుంటుంది. కాలు కిందపెడితే కందిపోతుందన్నట్టుగా చూడాలని, తమను ప్రపంచంలోని అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని.. స్వీట్ నథింగ్స్ చెప్పాలని ఆశపడుతుంది. 

భార్యను లేదా జీవిత భాగస్వామనికి ప్రేమగా, ఆప్యాయంగా, మురిపెంగా.. చూసుకోవడం వల్ల ఆ జంట వారి శృంగారజీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే స్త్రీలను అలా చాలా కొద్దిమంది పురుషులు మాత్రమే చూసుకుంటుంటారు. అయితే, వారిని గుర్తించడం ఎలా? అంటే దీనికి జ్యోతిష శాస్త్రం రాశులను బట్టే అనే సమాధానం చెబుతోంది. అలాంటి రాశుల పురుషుల గురించి వివరణా ఇస్తోంది. 

వృషభం (Taurus)
వృషభ రాశి పురుషులు చాలా హార్డ్ కోర్ రొమాంటిక్స్. ఈ రాశి పురుషులు ఉద్వేగభరితమైన వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందారు. వీళ్లు తమ స్త్రీ ప్రేమ కోసం ఏదైనా చేస్తారు. అందుకే అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామి సరైన ప్రేమ పొందుతోందా? జాగ్రత్తగా చూసుకోబడుతోందా? అనే విషయాన్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. వృషభరాశి వారి విధేయతకు కూడా ప్రసిద్ది. వీళ్లు ఒక్కసారి మనస్పూర్తిగా ప్రేమిస్తే తమ హృదయాన్ని అంకితం చెస్తారు. వెనక్కి తిరిగి చూడరు. 


కర్కాటకరాశి (Cancer) 
ఈ రాశి పురుషులు చాలా సెన్సిటివ్, ఎమోషనల్ గా ఉంటారు. ఆప్యాయత ఒక వ్యక్తిని ఎంత దగ్గర చేస్తుందో.. ప్రేమించేలా చేస్తుందో అర్థం చేసుకుంటారు. అందుకే వీరి మొదటి ప్రాధాన్యత వారి భాగస్వామితో తమ సంబంధంలో ఉంటుంది. తమ భాగస్వామి భావాలకు విలువ ఇవ్వడమే కాకుండా, వారిని అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ట్రీట్ చేస్తారు. అది తమ భాగస్వామి గుర్తించేలా చేయగలుగుతారు. 

మకరం (Capricorn)
తమ భాగస్వామిని ఇతరులకు చూపించడంలో గర్వపడతారు. వీరు ఎంత బాగా చూసుకుంటారంటే.. తాము  అందించే ప్రేమ, శ్రద్ధ, సంరక్షణతో తమ భాగస్వామిని మహారాణిలా భావిస్తారు. మకరరాశి వారు తమ భాగస్వామికి అంకితభావంతో ఉండే నమ్మకమైన వ్యక్తులు. మకరరాశి పురుషులు ఒక్కసారి కమిట్ అయ్యారో.. వారి మాట మారే వినరు. ఎప్పుడూ భాగస్వామిని అంటిపెట్టుకునే ఉంటారు. తామిష్టపడే వ్యక్తికి కట్టుబడి ఉండటం విలువ వారికి తెలుసు.

మీనం (Pisces)
వీరి ప్రేమలో చాలా పాషినేట్ ఉంటుంది. తమ భాగస్వామిని మహారాణిలా చూసుకోవడంలో ఎప్పుడూ విఫలం కారు. వీరికి కావాల్సిందల్లా అందమైన, అద్భుతమైన, శాశ్వతమైన ప్రేమ. అందుకే అదే లక్ష్యంగా పనిచేస్తారు. తాము ఎవరిని ఇష్టపడుతున్నాం.. ఎవరికి కమిట్ అవుతున్నాం అనే విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. అందుకే తామిష్టపడే వారు తమతో సరిగ్గా వ్యవహరించేలా చూసుకుంటారు. మీనరాశి వారు తమ స్త్రీలకి బహుమతులు, పువ్వులు, చాక్లెట్లు.. ఇలా సర్ ఫ్రైజ్ చేస్తూనే ఉంటారు.

Latest Videos

click me!