ఈ రాశివారికి సర్ ఫ్రైజ్ లంటే అస్సలు గిట్టదు...

Published : Apr 04, 2022, 12:42 PM IST

మన రాశులను బట్టి ఇష్టాయిష్టాలు ఉంటాయి. రాగద్వేషాలు ఉంటాయి. నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు ఉంటాయి. అలా ఏ రాశివారికి ఏ విషయాలంటే అస్సలు నచ్చవో ఒక్కసారి చూడండి. 

PREV
112
ఈ రాశివారికి సర్ ఫ్రైజ్ లంటే అస్సలు గిట్టదు...

మేషరాశి (Aries) : మేషరాశివారికి బద్దకస్తులంటే పరమచిరాకు. ప్రతీ పనికి బాగా టైం తీసుకుని నెమ్మదిగా చేసేవారంటే వీరికి  అస్సలు నచ్చదు. అందుకే వీరికి బాగా దూరంగా ఉంటారు. 

212

వృషభరాశి ( Taurus) : వీళ్లకు సర్ ఫ్రైజ్ లంటే అస్సలు గిట్టవు. అంతేకాదు రోజువారీ రొటీన్ లో ఏ కాస్త మార్పులు వచ్చినా వీరు తట్టుకోలేరు. అన్నీ ఒక పద్ధతిలో పెద్దగా మార్పులు లేకుండా అలా సాగిపోతుండాలి.

312

మిధునరాశి ( Gemini) : ఎవరైనా తమను వదిలేయ్.. అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా పని నుంచి తప్పుకోమన్నారనుకోండీ చిర్రెత్తుకొస్తుంది. 

412

కర్కాటకరాశి ( Cancer) : వీరికి విమర్శలంటే అస్సలు పడవు. విమర్శించేవాళ్లంటే నచ్చరు. ఒకవేళ అది సద్విమర్శ అయి తమకు మంచి జరుగుతుందన్నా.. వీరు అంత సులభంగా తీసుకోలేరు. 

512

సింహరాశి (Leo) : తమను సరిచేయాలని చూసే వారంటే వీరికి అస్సలు గిట్టరు. తమను కించపరుస్తూ... కిందికి లాగాలనే చూసేవాళ్లంటే వీరికి అసహ్యం.

612

కన్యారాశి ( Virgo) : వీరికి పెద్దగా శబ్దం చేసే వాళ్లంటే ఇష్టం ఉండదు. ఎక్కువ నాయిసీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారంటే వారినుంచి తప్పుకుని ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. 

712

తులారాశి ( Libra) : వీరికి కూడా పెద్ద పెద్ద హోరెత్తించే శబ్దాలంటే ఇష్టం ఉండదు. ఎక్కువగా వాదించేవారికి.. వాదనలు వేసుకునేవారికి దూరంగా ఉంటారు. 

812

వృశ్చికరాశి ( Scorpio) : అబద్దాలాడే వారంటే వృశ్చికరాశివారికి అస్సలు ఇష్టం ఉండదు. వీరంటే చాలా డేంజరస్ అని నమ్ముతారు. అందుకే వారిని కావాల్సినంత దూరం పెడతారు. 

912

ధనుస్సురాశి (Sagittarius) : వీరికి పద్ధతిగా ఉండడం ఇష్టం. కాజువల్ గా చిల్ అవుట్ అవుదాం అని ఎవరైనా అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. 

1012

మకరరాశి (Capricorn) : మకరరాశి వారికి తమ మీద అనుమానపడేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. వీరిని బాగా ద్వేషిస్తారు. అలాంటి వారిని చూస్తే వీరు ఫ్రస్టేట్ అవుతారు. 

1112

కుంభరాశి (Aquarius) : తమ తప్పులు ఎత్తిచూపితే కుంభరాశివారికి నచ్చదు. తాము చేసేది తప్పు అనే విషయం వారికి తెలిసినా.. ఎదుటి వారు చెబితే మాత్రం తీసుకోలేరు. ఇలా తమను కరెక్ట్ చేయాలని చూసేవారంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. 

1212

మీనరాశి (Pices) : మాటనిలబెట్టుకోని వారంటే మీనరాశివారికి అస్సలు నచ్చరు. ఒకసారి మాటిచ్చి తప్పితే వీరిని అస్సలు నమ్మరు. అది మీనరాశి వారిని చాలా నిరుత్సాహానికి గురి చేస్తుంది. వారిమీద నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. 

click me!

Recommended Stories