మేష రాశి వారి అధిపతి అంగారకుడు. అంగారకుడు శక్తి, ధైర్యం, కోపానికి ప్రతీక. అందుకే మేష రాశి వారికి సహజంగానే వేగం, శక్తి, ఉత్సాహం అధికంగా ఉంటాయి. వీళ్లు స్వార్థపరులుగా ఉంటారు. వీరు భాగస్వామి ఫీలింగ్స్‌ను ఏమాత్రం పట్టించుకోరు. తమకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో పోటీతత్వం ఎక్కువ. దీని వల్ల నిత్యం భార్యతో గొడవలు పడుతూ ఉంటారు. ప్రతీ దాంట్లో తామే ముందుండాలనే ఆలోచనతో, భార్యను తొక్కేస్తూ ఉంటారు. వీరికి కొత్త సాహసాలు చేయడం ఇష్టం. స్వేచ్ఛగా ఉండేందుకు ఇష్టపడతారు.