Mars Effects: భరణి నక్షత్రంలోకి కుజుడు, ఈ 4 రాశుల వారి జీవితంలో ఇక అన్నీ శుభ ఫలితాలే

Published : Apr 29, 2026, 10:53 AM IST

Mars Effects: మే నెలలో కుజుడు.. శుక్రుడి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. మే 29 శుక్రవారం ఉదయం కుజుడు భరణి నక్షత్రంలోకి అడుగు పెడతాడు. జూన్ 16 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. 

PREV
14
మేష రాశి

ఈ రాశిలోనే కుజ సంచారం జరుగుతుంది. కాబట్టి శుభ ఫలితాలు వీరికి దక్కుతాయి. వీరు ఆనందం, శాంతి, సానుకూల శక్తితో ముందుకు సాగుతారు. నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మీరు సమర్థత పెరుగుతుంది. తమపై తమకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల సలహాలు కూడా తీసుకుంటూ ముందుకు సాగుతారు. ఇక ఉద్యోగం చేసేవారు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

24
తులా రాశి

తులా రాశి వారికి కుజుడు భరణి నక్షత్రంలో అడుగు పెట్టడం అనేది జీవితంలో సంతోషాన్ని పెంచుతుంది. అలాగే ఆర్థికంగా స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా వీరికి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక విద్యారంగంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి మంచి ఉన్నత స్థాయి దక్కుతుంది. కాకపోతే వీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే ముఖ్యమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. అలాగే సమస్యలకు పరిష్కారాలు కూడా కనుక్కుంటారు.

34
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఫలితాలు కలిగే కాలం ఇది. వీరు ఎన్నో విజయాలను సాధిస్తారు. వీరి చిరకాల కోరికలు కూడా నెరవేరుతాయి. సామాజికంగా వీరు గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆదాయ మార్గాలు కూడా కొత్తవి ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు తీరిపోయి నూతనోత్సాహంతో జీవితంలో ముందడుగు వేస్తారు.

44
ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి కుజుడు.. భరణి నక్షత్రంలోకి ప్రవేశించడం జీవితంలో సానుకూలతను తీసుకొస్తుంది. వారి ఆత్మవిశ్వాసం రెండింతలు పెరుగుతుంది. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక దీర్ఘకాలకంగా వీరిని పట్టి పీడిస్తున్న సమస్యలు దాదాపు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే మంచి సమయం. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కూడా అధికంగానే కలిగే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories