Rahu Blessings: రాహువుతో కలిసిన కుజుడు, జీవితంలో ఈ రాశి వారికి అతి పెద్ద మలుపు

Published : Feb 03, 2026, 04:24 PM IST

Rahu Blessings: జ్యోతిషశాస్త్రంలో కుజుడు, రాహువును చెడు గ్రహాలుగా పరిగణిస్తారు. కానీ ఈ గ్రహాలు మంచి స్థితిలోకి వచ్చినప్పుడు విపరీతంగా కలిసి వస్తుంది. ఫిబ్రవరి 2026లో ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. 

PREV
14
వృషభం రాశి

వృషభ రాశి వారికి 10వ ఇంట ఈ రాహు కుజుడి  కలయిక జరుగుతుంది. దీని వల్ల వృత్తిపరంగా ఎన్నో మార్పులు వస్తాయి. ఫిబ్రవరిలో రాహు, కుజుడి సంయోగం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ సంబంధ పనులు చేస్తున్న వారికి మంచి అనుకూలఫలితాలు వస్తాయి.

24
తులా రాశి

తులా రాశి వారి 9వ ఇంట్లో రాహు కుజుల వల్ల యోగం ఏర్పడుతుంది. ఇది వారికి అదృష్టాన్ని అందిస్తుంది. వీరు విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయాణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.  ఇక వీరి పూర్వీకుల ఆస్తి వల్ల కలిగే సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇక ఉన్నత చదువులు చదివే విద్యార్థలకు తులా రాశి వారికి బాగా కలిసొస్తుంది.

34
వృశ్చికం రాశి

వృశ్చిక రాశికి వారికి అధిపతి కుజుడు. కాబట్టి రాజు కుజుల వల్ల ఏర్పడే యోగం వీరి జీవితంలో పెద్ద మలుపుకు కారణం అవుతుంది. ఇతరుల వద్ద ఉండిపోయిన బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. వీరికి ఆకస్మికంగా డబ్బు కలిసొచ్చే అవకాశం ఉంది. ఏ పోటీలలోనైనా గెలిచే సత్తా వీరికుంది. వ్యాపారం చేయాలనుకునేవారికి  కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి. అవి నెరవేరుతాయి.

44
మీన రాశి

మీన రాశి వారికి రాహు కుజుల సంయోగం బాగా కలిసిస్తుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. వీరు కోరికలన్నీ నెరవేరుతాయి. వృత్తిగత జీవితంలో విజయాన్ని అందుకుంటారు.  ధైర్యంగా కొత్త నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. దీర్ఘకాలికంగా మీనరాశి వారిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories