Lakshmi RajaYogam: మహాలక్ష్మీ రాజయోగం ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారు మట్టి ముట్టినా బంగారమయ్యే టైమ్

Published : Jan 09, 2026, 06:40 AM IST

Lakshmi RajaYogam: జ్యోతిషశాస్త్రం ప్రకారం జనవరిలో కుజ చంద్రుల వల్ల మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను అందిస్తుంది. ఆ సమయంలో వారు ఏ పని మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఏ రాశుల వారికి ఈ శుభయోగం ఉందో తెలుసుకోండి.

PREV
15
మహాలక్ష్మి రాజయోగం

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 18న అదే మకర రాశిలోకి కుజుడు, చంద్రుడు కూడా కలవబోతున్నారు. దీని వల్ల మకర రాశిలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది.  దీనివల్ల కొన్ని రాశుల వారికి బీభత్సంగా కలిసి వస్తుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, వృత్తి, వ్యాపారాల్లో కలిసిరావడం, ఇంట్లో సంతోషం వంటి జరుగుతాయి. ఏ రాశుల వారికి మహాలక్ష్మీ రాజయోగం వల్ల బీభత్సంగా కలిసివచ్చే అవకాశం ఉందో తెలుసుకోండి. 

25
మేష రాశి

మేషరాశి వారికి మహాలక్ష్మి రాజయోగం బాగా కలిసివస్తుంది. ఇది ఎంతో శుభప్రదమైనది కూడా. మేష రాశిలో జన్మించిన వారి ఈ యోగం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. వీరికి సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది. ఈ రాశి వజీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఈ రాజయోగం సమయంలో వీరు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. వీరి చేయాల్సిందల్లా గట్టి ప్రయత్నం.

35
తులా రాశి

మహాలక్ష్మి రాజయోగం తులారాశి వారి అదృష్టాన్ని మార్చేస్తుంది. అన్ని విధాలా కలిసి వచ్చేలా చేస్తుంది.  ఈ రాశి వారికి మకర సంక్రాంతి తర్వాత ఎన్నో శుభ పరిణామాలు చూస్తారు. ఊహించని ఆర్ధిక లాభాలు పొందుతారు. ఇంట్లోను, బయటా ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. వీరు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

45
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి మంచి రోజులు మొదలయ్యే కాలం ఇది. మహాలక్ష్మి రాజయోగం వల్ల ఈ రాశి వారు ఏ పని చేపట్టినా కచ్చితంగా విజయం సాధించి తీరుతారు.  ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీరు ఇల్లు లేదా వాహనం కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గట్టిగా కష్టపడితే డబ్బులపరంగా, ఆస్తులు పరంగా బాగా కలిసివస్తుంది.

55
మకర రాశి

మహాలక్ష్మి రాజయోగం వల్ల మకరరాశి వారు అన్ని విధాలా లాభపడతారు. ఇది వారికి చాలా శుభప్రదమైనది. ఏ పని చేసినా వీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రాజయోగం వల్ల సంపద పెరిగే ఛాన్స్ ఎక్కువ. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వేస్ట్ ఖర్చులు తగ్గించుకుంటే ఆర్ధికంగా బాగా బలపడతారు. 

Read more Photos on
click me!

Recommended Stories