Auspicious Yogas: నవంబర్ మొదటివారంలో రెండు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు పండగే!

Published : Oct 28, 2026, 05:23 PM IST

Auspicious Yogas: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో అత్యంత శుభ ప్రదమైన చంద్ర మంగళ, గజకేసరి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో 6 రాశులవారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మరి ఆ రాశులు ఏవో, వారికి ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

PREV
17
నవంబర్ లో అదృష్టం పొందే రాశులు

జ్యోతిష్యంలో చంద్రుడి సంచారం, కుజుడు, గురు గ్రహాల స్థానాలకు చాలా ప్రాధాన్యం ఉంది. నవంబర్ మొదటి వారంలో చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం ఏర్పడనున్నాయి. చంద్రుడు, కుజుడు ఒకే రాశిలో కలిస్తే దాన్ని చంద్ర మంగళ యోగం అంటారు. ఈ యోగం వల్ల డబ్బు సంపాదించాలనే ఆసక్తి, వ్యాపారంలో చురుకుదనం, ధైర్యం, పనితీరు మెరుగుపడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 1న చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న కుజుడితో కలిసి చంద్ర మంగళ యోగం ఏర్పరుస్తాడు.

అలాగే గురు, చంద్రుల కలయిక వల్ల ఏర్పడేదే గజకేసరి యోగం. ఇది జ్ఞానం, కీర్తి, గౌరవం, అభివృద్ధి, ఆర్థిక అవకాశాలను అందిస్తుంది. నవంబర్ 2న చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న గురుడితో కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. మరి ఈ యోగాల వల్ల ఏ రాశులవారికి అదృష్టం కలిసివస్తుందో తెలుసుకుందాం.

27
వృషభ రాశి

వృషభ రాశి వారికి డబ్బు విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెంచుకోవడానికి కొత్త దారులు వెతుకుతారు. ఆఫీసులో మీ టాలెంట్ చూపించడానికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేసేవాళ్లు భవిష్యత్తు ప్రణాళికలు జాగ్రత్తగా వేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి.

37
మేష రాశి

మేష రాశి వారికి ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. చాలా రోజులుగా అనుకుంటున్న పనులు మొదలుపెట్టాలనే ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా, లాభనష్టాలు ఆలోచించి అడుగు వేయడం మంచిది.

47
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఈ సమయంలో కొత్త ప్రయత్నాలపై దృష్టి పెడతారు. ఆఫీసు పనులను ప్లాన్ చేసుకుని చేయడం వల్ల మంచి గుర్తింపు వస్తుంది. ఆదాయం, పొదుపు విషయాల్లో క్రమశిక్షణ పాటించడం, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండటం చాలా ముఖ్యం.

57
సింహ రాశి

సింహ రాశిలో చంద్రుడు సంచరించే సమయంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత పనుల్లో సానుకూల మార్పులు వస్తాయి. కొత్త బాధ్యతలు తీసుకోవడం, కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పడటం లాంటివి జరుగుతాయి.

67
తుల రాశి

తుల రాశి వారికి వృత్తిపరంగా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికి మంచి అవకాశాలు వస్తాయి. రాబడి, ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేసుకుని, అనవసర ఖర్చులు తగ్గిస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

77
కుంభ రాశి

కుంభ రాశి వారు వ్యాపారం, ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు వెతుకుతారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులను మళ్లీ మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. ప్లానింగ్, ఓపిక, నిరంతర ప్రయత్నం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories