బంగారం అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి? గోల్డ్ అందరినీ ఆకర్షిస్తుంది. ఎవ్వరైనా సరే వారి స్థాయికి తగ్గట్టుగా బంగారం ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు మనం బంగారాన్ని పోగొట్టుకుంటాం. అలా జరగడం శుభమో.. అశుభమో ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం చాలా అమూల్యమైన లోహం. హిందూ ధర్మంలో బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ప్రతి ఒక్కరు వారి స్థాయిని బట్టి ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు కొందరు బంగారం పోగొట్టుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం పోగొట్టుకోవడం శుభమా? లేక అశుభమో ఇక్కడ తెలుసుకుందాం.
26
జ్యోతిష్యంలో బంగారం ప్రాముఖ్యత..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బంగారం గురు గ్రహానికి సంబంధించినది. గురువుని దేవగురు బృహస్పతి అని కూడా అంటారు. గురువు శుభ గ్రహం. జ్ఞానం, పరిపాలన, ఉన్నత స్థానం, ఆనందం, సంపదలకు కారకుడు.
36
బంగారం పోతే శుభమా? అశుభమా?
బంగారం ఆనందం, సంపదలకు సంబంధించినది. అది పోవడం శుభం కాదు. అందుకే బంగారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం పోవడం దురదృష్టానికి సంకేతం. గురువు బలహీనతకు కూడా ఇది సంకేతం కావచ్చు.
గురువు బలహీనత వల్ల ఉన్నత స్థానం పొందడం కష్టం. విద్యలో ఆటంకాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. బంగారం పోతే గురువుకి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
56
ఏ నగ పోతే ఏమవుతుందో తెలుసా?
మనలో చాలామంది మెడలో బంగారు చైన్ వేసుకుంటారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు లేదా ఎవరైనా దొంగిలించడం ద్వారా మనం ఒక్కోసారి చైన్ ని పోగొట్టుకుంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారు గొలుసు పోతే ఐశ్వర్యం తగ్గుతుందట. బంగారు కడియం పోతే గౌరవం తగ్గుతుందట. ఉంగరం పోతే ఆరోగ్య సమస్యలు వస్తాయట.
66
ముక్కుపుడక పోతే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారు ముక్కుపుడక పోవడం అపజయానికి సంకేతమట. చెవి రింగులు పోతే అశుభవార్తలు వినాల్సి వస్తుందట.
ఫైనల్ గా…
బంగారం పోగొట్టుకోవడం వల్ల నష్టమే తప్పా.. లాభం అయితే లేదు. కాబట్టి బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.