తులారాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అంతగా బాగుండదు. వీళ్లు పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలను చేయాల్సి వస్తుంది. అప్పుల భారాన్ని తగ్గించుకోవాలంటే సరైన ప్రణాళిక ఉండాలి. ఇకపోతే పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఓర్పుగా ఉంటేనే బాగుంటుంది.
ఉద్యోగం, వ్యాపారం
తులారాశి వారు వ్యాపార రంగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. అలాగే పెట్టుబడులు, ఒప్పందాలు మీకు కష్టాలను తెచ్చిపెడతాయి. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచనా, సహనంతో ఉంటే కష్టాలు, నష్టాలకు దూరంగా ఉంటారు. వ్యాపార వృద్ధి నెమ్మదిగా ఉంటుంది. ఇకపోతే ఉద్యోగులకు ఈ రోజు నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుంది. కష్టానికి తగిన ఫలితం దగ్గకపోవడంతో ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు.