వృశ్చికరాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయి. పాత అప్పుల బాధ ఎక్కువ అవుతుంది. భూమికి సంబంధించిన గొడవలు వస్తాయి. ఇది ఒత్తిడిని కలిగిస్తుంది. కొత్త వ్యాపారాలు, పెట్టుబడుల విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం మీకు అనుకూలంగా లేదు. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.
ఉద్యోగం, వ్యాపారం
వృశ్చికరాశి వారు వ్యాపారం విషయంలో కొత్త ఒప్పందాలకు అవరోధాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారంలో గొడవలు జరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టాల పాలు చేస్తాయి. వ్యాపారం విస్తరించే పనులకు దూరంగా ఉండండి. ఇకపోతే ఈ రోజు ఉద్యోగులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. బాగా ఒత్తిడికి గురవుతారు. మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. క్రమశిక్షణతో పూర్తి చేసిన పనులకు మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. సహచరులతో జాగ్రత్తగా ఉండండి.