Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!

Published : Sep 16, 2026, 05:45 PM IST

Mercury Venus Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. త్వరలో బుధుడు, శుక్రుడి కలయికతో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల 5 రాశులవారికి డబ్బు, కెరీర్ పరంగా అదిరిపోయే లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేవో చూడండి.

PREV
16
లక్ష్మీ నారాయణ రాజయోగంతో లబ్ధి పొందే రాశులు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. సెప్టెంబర్ 26న బుధుడు తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న శుక్రుడితో కలిసి శుభప్రదమైన లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పరుస్తాడు. తెలివితేటలు, మాటతీరు, వ్యాపారం, లెక్కలకు ప్రతీక అయిన బుధుడు... సంపద, లగ్జరీ, కళలు, బంధాలకు కారకుడైన శుక్రుడితో కలవడం వల్ల కొన్ని రాశులవారికి డబ్బు, కెరీర్, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందామా…

26
మిథున రాశి- కొత్త ఆదాయ మార్గాలు

మిథున రాశి వారికి ఈ గ్రహాల కలయిక వల్ల డబ్బు, కెరీర్ పరంగా మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు తలుపుతడతాయి. అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కాంటాక్ట్స్ దొరుకుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక మంచి అవకాశం ఇప్పుడు మీ సొంతం అవుతుంది.

36
తుల రాశి- కొత్త బాధ్యతలు

తుల రాశిలోనే ఈ బుధ, శుక్రుల కలయిక జరగనుంది. కాబట్టి ఈ రాశివారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కుతాయి. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందుతుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, పార్టనర్‌షిప్‌లు కుదిరి ఆదాయం పెరుగుతుంది.

46
ధనుస్సు- పెండింగ్ పనులు పూర్తి

ధనుస్సు రాశి వారికి ఈ రాజయోగం కొత్త ఆదాయ మార్గాలను చూపిస్తుంది. వ్యాపారులు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తారు. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు చకచక పూర్తవుతాయి. తెలివితేటలు, స్కిల్స్ వాడి కొత్త అవకాశాలను సృష్టించుకునే వారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది.

56
మకర రాశి- వ్యాపారంలో లాభాలు

మకర రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల ఉద్యోగం, వ్యాపారాల్లో బాగా కలిసొస్తుంది. ఆఫీసులో మీకు కీలక బాధ్యతలు దక్కుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. ఆదాయం పెంచుకునేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం.

66
కుంభ రాశి- కొత్త పరిచయాల వల్ల లాభాలు

కుంభ రాశివారికి ఈ గ్రహాల కలయిక డబ్బు, కెరీర్ పరంగా కొత్త అవకాశాలను తెస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదల, కొత్త బాధ్యతలు, అదనపు ఆదాయం వస్తాయి. వ్యాపారులకు కొత్త పరిచయాల వల్ల మంచి లాభాలు అందుతాయి. ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించాలి లేదా కొత్తగా ఏదైనా మొదలుపెట్టాలి అనుకునే వారికి ఈ సమయం అద్భుతంగా కలిసివస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories