వేద జ్యోతిషశాస్త్రంలో కేతువును ఒక రహస్యమైన గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహం వల్ల చెడు ప్రభావాలే కాదు కొన్ని సార్లు మంచి కూడా జరుగుతుంది. కేతువు వల్ల రాశుల వారి జీవితంలో ఆకస్మిక మార్పులు, రహస్యాలు, వైరాగ్యం వంటివి కలుగుతాయి. ఒక వ్యక్తి జాతకంలో కేతువు బలంగా ఉంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు.
కేతువుకు సొంత రాశి అంటూ లేదు. కానీ అశ్విని, మఘ, మూల నక్షత్రాలకు అధిపతిగా కేతువును చెప్పుకుంటారు. మార్చి 29న సింహరాశిలో ఉన్న కేతువు తన సొంత నక్షత్రమైన మఖలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.