గురు గ్రహం వల్ల ఏర్పడే హన్స్ మహాపురుష రాజయోగం వృషభ రాశి వారికి ఎన్నో మంచి ఫలితాలను అందిస్తుంది. వారికి ఆర్దికంగా కలిసివచ్చేలా చేస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పొదుపు కూడా చేయడం ప్రారంభిస్తారు. బంగారం, భూమి, వెండిపై పెట్టుబడులు పెడతారు. ఏదైనా వాహనం, ఆస్తి కొనే అవకాశాలు ఉన్నాయి.