Chaturgrahi Yoga: నాలుగు గ్రహాల అరుదైన కలయిక.. శ్రావణ మాసంలో వీరు పట్టిందల్లా బంగారమే

Published : Aug 08, 2026, 11:22 AM IST

Chaturgrahi Yoga: శ్రావణ మాసంలో బుధ, సూర్య, గురు, చంద్ర గ్రహాలు కలిసి చాతుర్గ్రహ యోగాన్ని ఏర్పరచనున్నాయి. అదే సమయంలో బుదాధిత్య రాజయోగం, గజకేసరి యోగం కూడా ఏర్పడనుంది.వీటి కారణంగా కొన్ని రాశుల వారికి సంపద రెట్టింపు కానుంది. ఆ రాశులు ఇవే..

PREV
15
మేష రాశి..

చాతుర్గ్రహ యోగం కారణంగా మేష రాశివారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. శ్రావణ మాసంలో వీరు పట్టిందల్లా బంగారమే. జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్నవారికి ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. పనిచేసే చోట గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళతారు. చేసే ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు.

25
కర్కాటక రాశి..

చాతుర్ర్గహ యోగం మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయి.. జీవితం ఒక్కసారిగా ఆనందంగా మారుతుంది. గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే.. అవి తిరిగి మీకు చేరతాయి.

35
సింహ రాశి..

చతుర్ర్గహ యోగం సింహ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగానూ కొత్త అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లోనూ మంచి లాభాలు రానున్నాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా మారుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరిగిపోతాయి.

45
వృశ్చిక రాశి...

చతుర్ర్గహ యోగం వృశ్చిక రాశివారికి అనేక శుభ ఫలితాలను తెస్తుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా ఉద్యోగంలో మార్పులు కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. మీరు కోరుకున్న మార్పులు చూస్తారు. ప్రమోషన్స్ వస్తాయి. శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

55
మీన రాశి..

చతుర్గ్రహ యోగం మీన రాశివారికి ఊహించని శుభ ఫలితాలు తీసుకువస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రతిభ తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు అన్ని పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఆదాయం అకస్మాత్తుగా పెరుగుతుంది. డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. శ్రావణ మాసంలో వీరు కోరుకున్నవన్నీ నెరవేరతాయి.

Read more Photos on
click me!

Recommended Stories