జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి సంచారం కొన్ని రాశులవారికి శుభఫలితాలను ఇస్తుంది. త్వరలో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు. ఈ మార్పు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు మారడం సహజం. జ్ఞానం, సంపద, ఉన్నత విద్యకు కారకుడైన గురువు జూన్ 2న మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకం గురు గ్రహానికి ఉచ్ఛ స్థానం. దానివల్ల ఈ సంచారం కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఆ రాశులు ఏవో, వారికి కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
26
మేష రాశి- కొత్త అవకాశాలు
మేష రాశి వారికి గురు సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో మంచి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగవుతుంది. ఇంటా, బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులతో ఉన్న వివాదాలు సర్దుమణుగుతాయి.
36
మిథున రాశి- వాహన యోగం
మిథున రాశివారు గురుడి ఉచ్ఛస్థితి వల్ల ఆర్థికంగా లాభపడతారు. పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఎప్పటినుంచో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. దాంపత్య జీవితం సంతోషకరంగా సాగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు దక్కుతాయి.
కర్కాటక రాశి వారికి గురు గ్రహ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. కెరీర్‌లో ముందుకు సాగేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్ధతు లభిస్తుంది. నిరుద్యోగుల కలలు సాకరమవుతాయి.
56
కన్య రాశి- వ్యాపారాల్లో లాభాలు
కన్య రాశి వారికి గురు గ్రహ సంచారం అదృష్టాన్ని మోసుకువస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు చక చకా పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. ఉద్యోగాలలో మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
66
మకర రాశి- పెద్ద విజయాలు
గురు సంచారం మకర రాశి వారికి అనుకూలమైన కాలాన్ని తెస్తుంది. ఈ రాశివారు చిన్న ప్రయత్నంతో పెద్ద విజయం సాధిస్తారు. ఒక ముఖ్యమైన ఒప్పందం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి.