ధనుస్సు రాశి....
గురు గ్రహ నక్షత్ర మార్పు ధనుస్సు రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు సంబంధించిన పనులు చేస్తున్నట్లయితే... ఈ కాలంలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా రుణ బాధలు కూడా తీరతాయి.
ధనుస్సు రాశిలో జన్మించినవారు తమ ఇళ్లలో సంతోషం, ప్రశాంతత , సానుకూల వాతావరణాన్ని అనుభవిస్తారు. ఈ సమయంలో, ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాలంలో, మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. తెలివిగా పనిచేయడం భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది.