జోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ గురు గ్రహం ఉంటే.. జీవితంలో డబ్బు కు లోటు ఉండదు. అంతేకాదు.. కెరీర్ పరంగానూ అద్భుతంగా ఉంటుంది. ఇటీవల అంటే జనవరి 2వ తేదీన గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. దాదాపు ఐదు నెలల పాటు ఇదే రాశిలో ఉంటుంది. అంటే అక్టోబర్ 31 వరకు ఇదే రాశిలో సంచరిస్తూ ఉంటుంది. అది కూడా ఉన్నత స్థితిలో ఉంటుంది.ఇది చాలా శుభ పరిణామం. ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని మోసుకువస్తుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం...