June Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. జూన్ నెలలో ఏ రాశివారికి బాగుందో తెలుసా?

Published : Jun 01, 2026, 12:54 PM IST

June Horoscope: ఈ మాస ఫలాలు జూన్ నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
మాస ఫలాలు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఈ నెల మేష రాశివారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తండ్రి తరపు నుంచి స్థిరాస్తి లాభాలు పొందుతారు. సంతానం విద్యా విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

వృషభ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తల్లి తరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలలో ముందంజలో ఉంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.

413
మిథున రాశి ఫలాలు

మిథన రాశివారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అవసరానికి బంధు మిత్రుల నుంచి డబ్బు సహాయం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలను రాజీ చేసుకుంటారు. దాయాదులతో వివాదాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షల కోసం మరింత కష్టపడాల్సి వస్తుంది. నెల ఆఖరులో డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.

513
కర్కాటక రాశి ఫలాలు

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. చేపట్టిన ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు సాగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతానం విద్యా విషయాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

613
సింహ రాశి ఫలాలు

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి విమర్శలు తప్పవు. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు తప్పవు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. మాసం చివరన మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

713
కన్య రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ప్రతీ వ్యవహారంలో ఆందోళనలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. వృత్తి, వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

813
తుల రాశి ఫలాలు

ఈ మాసం తుల రాశివారికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు చిన్న ప్రయత్నంతో అధిక ఆదాయం పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయటా అందరిని ఒక తాటిపైకి తీసుకువస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయట పడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. వాహన వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.

1113
మకర రాశి ఫలాలు

ఈ మాసం మకర రాశివారికి అంతగా అనుకూలించదు. చేపట్టిన పనులలో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతాన ఆరోగ్యం విషయాలలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకి తగ్గిన ఫలితం లభించదు. ఇంటా బయటా పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. నిరుద్యోగుల కష్టం వృథాగా మిగులుతుంది. ఆర్థిక వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు

ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరులను విమర్శించడం మానుకోవాలి. కుటుంబ వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు మానసికంగా కలచివేస్తాయి. సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభించదు. నూతన వ్యాపారాల ప్రారంభానికి పెట్టుబడులు అందవు. వృథా ప్రయాణాలు చేస్తారు.

1313
మీన రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు పెద్దల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Read more Photos on
click me!

Recommended Stories