June Horoscope: జూన్ నెలలో గ్రహాల మార్పులు చాలా కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా రాశుల కలయిక.. జోతిష్య శాస్త్రంలో కొన్ని రాశుల వారికి అనేక సమస్యలు తెచ్చి పెట్టేలా ఉంది. అనుకోని ఒత్తిడితో ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు తరచూ తమ స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. ఈ మార్పు.. ఒక్కోసారి శుభ యోగాలను ఏర్పరిస్తే.. మరోసారి అశుభ యోగాలను కూడా ఏర్పరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా అర్థ కేంద్ర యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జూన్ 4, 10, 26 తేదీల్లో ఈ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో గ్రహాలు పగపట్టడం కారణంగా కష్టాలు అనుభవించే రాశులు ఏంటో చూద్దాం….
26
వృషభ రాశి...
ఈ జూన్ నెలలో వృషభ రాశివారికి ఊహించని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి ఒత్తిడి కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయి.
36
సింహ రాశి
జూన్ నెలలో సింహ రాశివారికి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందుల్లో పడొచ్చు. ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి.. జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.
జూన్ నెలలో కన్య రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఊహించని ఇబ్బందులు ఎదురౌతాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆచితూచి ఆలోచించి అడుగులు వేయాలి. ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది..
56
ధనుస్సు రాశి...
ధనుస్సు రాశివారు జూన్ నెలలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ నెల అంతా తరచూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబంలో వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు. తరచూ గొడవలు జరిగొచ్చు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి.
66
కుంభ రాశి...
కుంభ రాశివారు జూన్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు విషయాల్లో తల దూర్చకూడదు. ఈ నెలలో ఈ రాశివారికి ఆందోళన పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎర్పడతాయి. కుటుంబంలో కూడా ఏవో ఒక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల కాస్త ఓపికగా ఉంటే.. సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంటుంది.