Raj-Ketu Transit: జులై 20 తర్వాత ఈ మూడు రాశుల జీవితం మారిపోతుంది, కష్టాలన్నీ తీరినట్లే..!

Published : Jul 19, 2025, 05:20 PM IST

రాహువు పూర్వాభద్ర నక్షత్రంలోకి, కేతు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాయి. ఈ నక్షత్ర మార్పు.. మూడు రాశుల జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేయనుంది.

PREV
14
రాహు-కేతు నక్షత్ర మార్పు..

జోతిష్య శాస్త్రం ప్రకారం జులై 20 వ తేదీ ఎంతో విశిష్టమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున రాహు, కేతు అనే ముఖ్యమైన గ్రహాలు నక్షత్ర మార్పు చేయనున్నాయి. ఇది చాలా అరుదైన సంఘటన. సాధారణంగా ఈ గ్రహాలు రాశి మార్పు చేయానికి 18 నెలలు పడుతుంది. కానీ, నక్షత్ర మార్పులు మాత్రం తరచుగా జరుగుతూనే ఉంటాయి. జులై 20వ తేదీన మరోసారి ఇవి నక్షత్రాన్ని మార్చుకోనున్నాయి.రాహువు పూర్వాభద్ర నక్షత్రంలోకి, కేతు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాయి. ఈ నక్షత్ర మార్పు.. మూడు రాశుల జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేయనుంది. ఆ మూడు రాశులేంటో చూద్దామా...

24
1.కన్య రాశి....

రాహు, కేతువుల నక్షత్ర మార్పు... కన్య రాశివారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. ముఖ్యంగా అదృష్టం కలగనుంది. గతంలో ఎదురైన అనేక సమస్యలు ఇప్పుడు తొలగిపోతాయి. పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు కలిగే అవకాశం ఉంది. డబ్బు ఎక్కువగా చేతికి అందే అవకాశం ఉంది.

34
2.మకర రాశి...

రాహు , కేతువుల నక్షత్ర సంచారం మకర రాశివారికి చాలా మేలు చేయనుంది. ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. ముఖ్యంగా జీతం పెరుగుతుంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. మీరు కోరుకున్న కోరికలన్నీ ఈ సమయంలో నిజం అవుతాయి. ముఖ్యంగా ప్రొఫెషనల్ రంగంలో ఎదుగుదల స్పష్టంగా కనిపించనుంది.

44
3.తుల రాశి...

తులా రాశివారికి ఈ సమయంలో నుదిటి రాత మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో విస్తారమైన లాభాలు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. గతంలో ఎదురైన సమస్యలు పరిష్కారమవుతాయి. సంపాదన పెరుగుతుంది. జీవితం స్థిరంగా, శుభప్రదంగా సాగుతుంది.

ఫైనల్ గా...

ఈ గ్రహ సంచారాలు ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలను తీసుకువస్తాయి. అయితే, శుభ ఫలితాల కోసం సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. గురువులు, పెద్దల సలహాలు తీసుకోవడం, ధార్మిక మార్గంలో నడవడం వల్ల గ్రహబలాలు ఇంకా బలపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories