January Horoscope: జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!

Published : Jan 01, 2026, 03:03 PM IST

January 2026 Horoscope: ఈ మాస ఫలాలు జనవరి నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
మాస ఫలాలు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

జనవరి నెల మేష రాశివారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్రాలు దర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ముఖ్యమైన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నెలాఖరులో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. 

313
వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపార ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. నెలాఖరులో దగ్గరి బంధువు వియోగం బాధిస్తుంది.

413
మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నెల మధ్యలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. వృత్తి, వ్యాపార వ్యవహారాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్త్ర లాభం కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. నెలాఖరులో బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి జనవరి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని వ్యవహారాలలో విజయం సాదిస్తారు. అన్నివైపుల నుంచి ఆదాయం బాగుంటుంది. సరైన సమయానికి డబ్బు సహాయం లభిస్తుంది. వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.  

613
సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి ఈ మాసం అంతా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం తగినంత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సన్నిహితులకు సహాయ సహకారాలు అందిస్తారు. సంఘంలో పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు చేస్తారు. 

713
కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుతాయి. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. 

813
తుల రాశి ఫలాలు

తుల రాశివారికి జనవరి నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. దూరప్రాంత ప్రయాణాలు వల్ల అలసట పెరుగుతుంది. నెల మధ్యలో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

913
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఈ మాసంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల అండదండలు లభిస్తాయి. చేపట్టిన పనులను సమయానుసారం పూర్తిచేస్తారు. కుటుంబ వ్యవహారాలు ఒక ప్రణాళికలతో ముందుకు తీసుకువెళ్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయం బాగుంటుంది. స్త్రీ సంబంధిత ధన లాభాలు కలుగుతాయి. నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. వాహన యోగం ఉంది. 

1013
ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలమవుతాయి. దూర ప్రయాణాల వల్ల నూతన పరిచయాలు కలుగుతాయి. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. 

1113
మకర రాశి ఫలాలు

మకర రాశివారికి ఈ నెలలో గంధరగోళ పరిస్థితులు ఉంటాయి. ఏ పని చేయాలి అనిపించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాల్లో శ్రమ పెరగడంతో చికాకులు పెరుగుతాయి. కొంతమంది ప్రవర్తన వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులను చేజారకుండా చూసుకోవాలి. స్త్రీ సంబంధిత వివాదాలు కలుగుతాయి. తగినంత ఆదాయం లభించదు. చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది. 

1213
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి ఈ నెలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. మానసిక సమస్యలు తొలగుతాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. దూరప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. రుణ బాధలు తొలగుతాయి.  

1313
మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఊహించిన దాని కంటే అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత మిత్రులతో సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు లాభదాయకం. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. అన్ని వ్యవహారాలు అనుకున్న విధంగా జరుగుతాయి. నూతన వస్త్ర, వస్తు ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories