2025లో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో తెలుసా?

Published : Jan 21, 2025, 10:48 AM IST

2025లో పుట్టిన  పిల్లలు ఎలా ఉంటారు..? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..  

PREV
14
2025లో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో తెలుసా?

మనమంతా 2025లో అడుగుపెట్టాం.  ఆల్రెడీ జనవరి నెల కూడా ముగియవస్తుంది. ఇప్పటి వరకు ఈ కొత్త సంవత్సరంలో  చాలా మంది పిల్లలు పుట్టే ఉంటారు. పుట్టిన సమయంలో గ్రహాల స్థానం ఆధారంగా పిల్లల వ్యక్తిత్వం, ఆరోగ్యం, విద్య, కెరీర్, వివాహ జీవితం గురించి కొన్ని అంచనాలు వేయవచ్చు. మరి, 2025లో పుట్టిన  పిల్లలు ఎలా ఉంటారు..? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

24

న్యూమరాలజీ ప్రకారం 2025 ని నెంబర్ 9గా పరిగణిస్తారు. దీని పాలక గ్రహం కుజుడు. కుజుసడు శక్తి, ధైర్యం, న్యాయకత్వం, పట్టుదలకు సంకేతం. కాబట్టి...  ఈ సంవత్సరంలో పుట్టిన పిల్లలకు  ఈ లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో పుట్టిన పిల్లలు చాలా వినూత్నంగా, సృజనాత్మకంగా ఉంటారు. 

34

నెంబర్ 9 సమాజిక సేవతో కూడా ముడిపడి ఉంటుంది. అందువల్ల ఈ పిల్లలు ఇతరులకు సహాయం చేయాలనే, సమాజానికి ఏదైనా చేయాలనే భావన కలిగి ఉంటారు. అంగారక గ్రహ ప్రభావం కారణంగా, ఈ పిల్లలు శక్తివంతంగా , చురుకుగా ఉంటారు. వారు శారీరక శ్రమలపై ఆసక్తి చూపుతారు . ఎల్లప్పుడూ కొత్తగా ఏదైనా చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ పిల్లలకు నాయకత్వ సామర్థ్యాలు ఉంటాయి. వారు ఇతరులను ప్రేరేపించగలరు. సమూహాలను నడిపించగలరు. ఈ పిల్లలు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

44


ఈ సంవత్సరం జన్మించిన పిల్లలు తరచుగా బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉంటారు. వారు వివిధ రంగాలలో ఆసక్తి కలిగి ఉండవచ్చు.  బహుళ ప్రతిభను ప్రదర్శించవచ్చు. ఈ పిల్లలు ఎక్కువ సృజనాత్మకతను కలిగి ఉంటారు.  కళ, సంగీతం లేదా రచన వంటి రంగాలలో రాణించవచ్చు. సైన్యం, పోలీసు , ఇతర సాయుధ దళాలకు సంబంధించిన కెరీర్‌లను ఎంచుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది.. ఈ పిల్లలు శారీరక బలం, ధైర్యం , నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు, అవే వారిని ఈ రంగాలలో విజయవంతం చేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories