ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు చనిపోయినప్పుడు... వారి బంగారం, విలువైన వస్తువులను వారి పిల్లలు, వారసులు తీసుకుంటూ ఉంటారు. కొందరు ఆ బంగారాన్ని గుర్తుగా వాళ్లే ఉంచుకుంటారు. కొందరు మాత్రం.. అలా వేసుకోకూడదు అని.. ఆ బంగారాన్ని కరిగించి.. వేరే వస్తువు చేయించుకుంటూ ఉంటారు. కానీ.. ఇందులో ఏది నిజం. శాస్త్రాల ప్రకారం.. చనిపోయిన బంగారం వేరే వాళ్లు వేసుకోవచ్చా..? వేసుకోకూడదా..? ఇప్పుడు తెలుసుకుందాం...
జోతిష్యశాస్త్రం మన జీవితానికి సంబంధించి చాలా విషయాలు చెబుతుంది. దానిని అనుసరిస్తే మనం కూడా ఆనందంగా ఉంటామని నమ్ముతారు. ఆ జోతిష్యశాస్త్రం ప్రకారమే... చనిపోయిన వారు ధరించిన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను మరొకరు వాడకపోవడమే మంచిదట. ఎందుకంటే.. బంగారం సూర్య గ్రహానికి సంబంధించినది. చనిపోయిన వారి ఆభరణాలు ధరించడం వల్ల ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయట. అంతేకాదు.. మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడటం మొదలౌతుందట. అది మీ ఆరోగ్యం నుంచి, ఆర్థిక పరిస్థితి వరకు మొత్తం ప్రభావితం చేస్తుంది.
దీనికి ప్రధాన కారణం ఏమిటంటే బంగారం సూర్యుని లోహం. వ్యక్తి మరణించిన తరువాత, ఆ ఆభరణాల సూర్య శక్తి తగ్గుతుంది. జీవించి ఉన్న వ్యక్తి ఆ నగలను ధరించినప్పుడు, ఈ ఆభరణాల అనేక ప్రతికూల ప్రభావాలు అతని జీవితంలో కనిపించడం ప్రారంభిస్తాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది ఎందుకంటే బలహీనమైన సూర్యుడు ప్రతిచోటా మీకు హాని కలిగించవచ్చు. మరణించిన వ్యక్తి ఆభరణాలను ధరించడం వలన మీ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. మీరు వ్యాపారంలో నష్టాలను చవిచూడవచ్చు. మీరు ఊహించని విధంగా మీ పని చెడిపోవచ్చు.
జీవించి ఉన్న వ్యక్తి ఆభరణాలను లేదా మరణించిన వ్యక్తికి ఇష్టమైన మరేదైనా వస్తువును ఉపయోగిస్తే, అతని ఆత్మకు శాంతి లభించదని గరుణ్ పురాణం చెబుతుది. ఇలా చేయడం ద్వారా, మరణించిన వ్యక్తి ఆత్మ ఎల్లప్పుడూ సమీపంలో ఉంటుంది. మోక్షం కూడా లభించదట.
ఎవరైనా ఇలా చేస్తే, చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆకర్షణ ఎల్లప్పుడూ జీవించి ఉన్న వ్యక్తుల పట్ల ఉంటుంది. అది పితృ దోషానికి కూడా కారణం కావచ్చు. ఈ కారణంగా, మరణించిన వ్యక్తి ఏదైనా ప్రియమైన వస్తువును, ముఖ్యంగా ఆభరణాలను ఉపయోగించకుండా ఉండటమే మంచిది. కావాలంటే.. గుర్తుగా ఓచోట ఉంచుకోవచ్చు,
లేదు.. ఆ వస్తువును మీరు వాడాలి అనుకుంటే.. శుద్ధి చేసి ఉపయోగించవచ్చు, ఆ ఆభరణాలను గంగా జలంలో 24 గంటలు ఉంచి.. శుద్ధి చేసి.. ఆ తర్వాత.. వాడితే ఈ దోషాలు ఉండవట. శుధ్ది చేసిన వెంటనే కూడా వాడకూడదట. పసుపు దారంతో కట్టి.. 21 రోజులు పక్కన ఉంచి.. ఆ తర్వాత ధరించవచ్చట. అలా కాదు అంటే.. ఆ బంగారాన్ని కరిగించి.. మళ్లీ.. కొత్తగా చేయించుకోవచ్చు. ఇక బంగారం మాత్రమే కాదు.. వెండి వస్తువులు అయినా.. శుధ్ధి చేయకుండా ధరించకపోవడమే మంచిది.