పర్సులో వీటిని పెట్టుకున్నారంటే మీకు డబ్బుకు కొదవే ఉండదు..

First Published | May 14, 2024, 2:35 PM IST

సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం.. పర్సులో కొన్ని వస్తువులను పెడితే మీ జీవితంలో డబ్బుకు కొదవే ఉండదు. అలాగే మీ సంపద కూడా పెరుగుతుంది. 
 

సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. పర్సులో కొన్ని వస్తువులను ఉంచితే జీవితంలో ధనానికి కొదవ ఉండదని, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. ఇందుకోసం పర్సులో ఏయే వస్తువులను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వెండినాణెం

మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనుకుంటే మీ పర్సులో వెండి నాణెన్ని పెట్టండి. వాస్తు శాస్త్రం ప్రకారం.. వెండి నాణేన్ని పర్సులో పెట్టే ముందు దానిని లక్ష్మీదేవికి సమర్పించండి. ఆ తర్వాతే నాణేన్ని పర్సులో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ ధనం పెరుగుతుంది. 


కుబేర యంత్రం

కుబేరుడిని సంపదల దేవుడిగా భావిస్తారు. అందుకే సంపద సాధనకు కుబేర యంత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. వాస్తు ప్రకారం.. కుబేర యంత్రాన్ని పర్సులో పెట్టడం వల్ల మీకు సంపద, శ్రేయస్సు కలుగుతాయి. అయితే కుబేర యంత్రాన్ని పసుపు రంగు వస్త్రంలో చుట్టి పర్సులో పెట్టుకోవడం మంచిది. ఇంట్లో లక్ష్మీదేవి రాక కావాలంటే దీన్ని పర్సులో పెట్టుకోవాలి. ఇది జాతకునికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.

వరిని ఎదుగుదలకు చిహ్నంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. బియ్యం ధాన్యాలను పర్సులో ఉంచడం వల్ల సంపద అపారంగా పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. 

లక్ష్మీ దేవి గోమతి చక్రం కూడా మీ సంపదను, ధనాన్ని పెంచుతుంది.  వాస్తు శాస్త్రం ప్రకారం.. గోమతి చక్రాన్ని పర్సులో ఉంచడం వల్ల మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

Latest Videos

click me!