ఇంట్లో శంకుపువ్వుల చెట్టు ఉంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 15, 2024, 11:19 AM IST

శంకుపువ్వులు ఎంతో అందంగా ఉంటాయి. ఈ పువ్వులను దేవుడికి కూడా సమర్పిస్తుంటారు. అందుకే చాలా మంది ఆడవారు ఇంటి దగ్గర శంకుపువ్వుల చెట్టును పెంచుతారు. కానీ ఈ మొక్కను ఇంటిదగ్గర పెంచితే ఏమౌతుందో తెలుసా?

హిందూమతంలో కొన్ని మొక్కలకు, చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే విధంగా వాస్తు శాస్త్రంలో అపరాజిత మొక్క(శంకుపూల) ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఈ మొక్కను నాటితే ఎన్నో కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఇంటిదగ్గర ఈ మొక్క ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

లక్ష్మీదేవి అనుగ్రహం

వాస్తు శాస్త్రం ప్రకారం.. అపరాజిత మొక్కను ఇంటిదగ్గర నాటడం వల్ల మీ కుటుంబానికి లక్ష్మీదేవి ఆశీస్సులు అందుతాయి. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని జ్యోతిష్యులు చెప్తారు. 
 

Latest Videos



ఆర్థిక ఇబ్బందులు 

అపరాజిత మొక్కను ఇంట్లో నాటడం వల్ల మీకు ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ధన సంక్షోభం తొలగిపోతుంది.


దుఃఖాలు నశిస్తాయి

శంకపూల మొక్కను ఇంటి దగ్గర నాటితే మీ ఇంటిలో సౌభాగ్యం వెల్లివిరుస్తుంది. అలాగే మీ దుఃఖాలు నశిస్తాయి. కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. 

నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది

మీ ఇంట్లో ప్రతికూలత ఉంటే.. దానిని తొలగించడానికి మీ ఇంటి దగ్గర అపరాజిత మొక్కను నాటాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవును అపరాజిత మొక్కను ఇంటి దగ్గర నాటితే నెగిటీవ్ ఎనర్జీ మొత్తం పోయి సానుకూలత వస్తుంది.
 

గొడవలు, కొట్లాటలు

ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అనవసరమైన కొట్లాటలు జరుగుతుంటే ఇంట్లో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండరు. అయితే ఈ గొడవలు, కొట్లాటలకు స్వస్తి చెప్పడానికి అపరాజిత మొక్క మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అవును శంకుమొక్క ఇంట్లో కలహాల నుంచి విముక్తి కలిగిస్తుంది. 
 


ఆశీస్సులు 

ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం వల్ల మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. ఈ మొక్క శుభ ఫలితం మీ ఇంటి పురోభివృద్ధికి దారితీస్తుంది.

అపరాజిత మొక్కను ఏ దిశలో నాటాలి?

అపరాజిత మొక్కను మీ ఇంటికి తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటొచ్చు. ఈ దిక్కుల్లో ఈ మొక్కను నాటడం వల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి.
 

click me!